ఏ ఆర్థికవ్యవస్థ అయినా ఎగుమతులు, దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యే కొద్దీ ఎగుమతి, దిగుమతి వ్యాపారం కీలకంగా మారనుంది. ఇందులో సముద్ర సరుకు రవాణా అతి కీలకం.. 90 శాతం సముద్ర సరుకు రవాణా ద్వారానే జరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం.
క్రీస్తు పూర్వం కూడా భారత్ మేటి ఆర్థిక వ్యవస్థగా.. మేటి నాగరికత వ్యవస్థగా ఉండడానికి కారణం సముద్ర సరుకు రవాణానే. రోమన్ సామ్రాజ్యంతో సరుకు రవాణా చేశాం.. మెసపటోనియాతో చేశాం. సూయజ్ కాలువ ద్వారా ఎన్నో ప్రాచీణ సంస్కృతి సంప్రదాయాలు విదేశాల్లో దొరికాయి.
అత్యంత రవాణా జరిగిన గోల్డెన్ వే భారత్ దే.. క్రీ.పూర్వం నుంచి 1200 శతాబ్దం వరకూ ఈ రవాణా జరిగింది.. ప్రస్తుతం టాప్ 20 సీపోర్టులో ఒక్కటి భారత్ లో లేవు. టాప్ 10లో ఆరు చైనాలోనే ఉండడం విశేషం. అందుకే మన అభివృద్ధి పడకేసింది.
సముద్ర సరుకు రవాణాలో భారత్ ఎందుకు వెనకబడింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
