Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్స్ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు…చూడాలి మరి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ లో ఎవరు స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతారు అనేది…
దసర సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… ఆయన ఇక మొదట చేస్తున్న ప్రతి సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నానితో ఒక గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో ఉండే సినిమాను తెరకెక్కించే పనిలో తను బిజీగా ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి అయితే నెలకొంటుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి ఒక మాస్ మసాలా సినిమా ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా 2026 సమ్మర్ నుంచి సెట్స్ మీదకి తీసుకువెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఈ గ్యాప్ లో నానితో శ్రీకాంత్ ఓదెల సినిమాని కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడికి చిరంజీవి ని డైరెక్టు చేసే అవకాశం దొరకడం అనేది నిజంగా చాలా గొప్ప అదృష్టమనే చెప్పాలి. ఇక వీళ్ళ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. గత కొన్ని రోజులుగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన రాజశేఖర్ ని ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక చిరంజీవిని ఢీకొట్టే పాత్రలో రాజశేఖర్ కనిపించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఏ జానర్ లో తెరకెక్కబోతుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు..కానీ మొత్తానికైతే రాజశేఖర్ ను విలన్ గా తీసుకునే ఆలోచనలో శ్రీకాంత్ ఓదెల ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవికి రాజశేఖర్ కి మధ్య అప్పట్లో కొన్ని వివాదాలైతే తలెత్తాయి. మళ్లీ అవి సద్దుమనగడంతో ఇప్పుడు అంతా కలిసిపోయి ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి తన సినిమాలో రాజశేఖర్ కి ఆఫర్ ఇవ్వడం అనేది కూడా రాజశేఖర్ కి చాలా గొప్ప అవకాశం అనే చెప్పాలి.
ప్రస్తుతానికైతే రాజశేఖర్ కి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. నితిన్ హీరోగా వచ్చిన ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికి ఆయనకు అంత మంచి గుర్తింపైతే రాలేదు. మరి ఈ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…