Delhi Assembly Elections : ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 1వ తేదీన బడ్జెట్ రిలీజ్ అవ్వబోతోంది. నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. బడ్జెట్ లో మధ్యతరగతికి ఊరట లభిస్తే ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. మరి అసలు ఈ ఎన్నిక ప్రత్యేకత ఏమిటిన్నది తెలుసుకుందాం.
అరవింద్ కేజ్రీవాల్.. 2013 నుంచి అప్రతిహతంగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాయి. పోయిన ఎన్నికల తర్వాత క్లీన్ ఇమేజ్ ఉన్న కేజ్రీవాల్ పై ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి జైలు పాలు కావడంతో ఆయన ప్రతిష్ట మసకబారింది
సీఎంగా కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియాలు జైలు పాలయ్యారు అవినీతి జరిగిందని తిరస్కరిస్తారా.? జైలుకు వెళ్లాడని సానుభూతితో ఓట్లు వేసి గెలిపిస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఇది నగర ఓటర్లు ఉన్న రాష్ట్రం. ఇందులో మధ్యతరగతి వారు ఎక్కువగా ఉంటారు. మధ్యతరగతితోపాటు అర్బన్ పూర్ వారు ఎక్కువ మంది వలస వచ్చిన వారు కూడా గణనీయంగా ఉన్నారు. 13 శాతం ముస్లిం జనాభా కూడా ఉంది.
మోడీ, యోగిలు ఉధృతంగా ప్రచారం చేస్తున్న ఢిల్లీ ఫలితం ఎలా ఉండబోతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు
