Waqf Bill : ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయా? పార్లమెంట్ లో ఒకటి.. బయట మరో వైఖరి తీసుకుంటున్నాయా? పార్టమెంట్ లో వక్ఫ్ బిల్లు పెట్టినప్పుడు జేపీసీకి రిఫర్ చేసింది ప్రభుత్వం.. జేపీసీలో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలందరికీ ఉంది. అంతపెద్ద అవకాశం ఇచ్చి అందరి అభిప్రాయాలను తీసుకుంది.
పార్లమెంట్ లోనూ ఎన్నడూ జరగనంత చర్చ జరిగింది. లోక్ సభలో అసలు ఇంతవరకూ లోక్ సభలో రెండో అతిపెద్ద జరిగింది. ఇంత విస్తృత చర్చ తర్వాత ఆమోదించాక ఎందుకు అపోహలు వస్తున్నాయి. పార్లమెంట్ లో మద్దతు ఇచ్చాక దానికి కట్టుబడి ఉండాలి.
అయితే పార్లమెంట్ లో బిల్లు మాట్లాడి తర్వాత బయట మాట మార్చడం వెనుక పార్టీల ధ్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనం.
వక్ఫ్ బోర్డును టీటీడీ బోర్డుతో పోలుస్తున్నారు. టీటీడీలో హిందూయేతరులు లేరు కాబట్టి వక్ఫ్ బోర్డులో ముస్లింయేతరులు ఉండకూడదన్న నిబంధనను వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే టీటీడీ ధార్మిక సంస్థ.. వక్ఫ్ బోర్డు ఒక ఆస్తుల నిర్వహణ సంస్థ. ముస్లింలయేతరులు ఇందులో ఉండొచ్చని అమిత్ షా పార్లమెంట్ లోనే తెలిపారు.
NDA భాగస్వామ్య పార్టీలు వక్ఫ్ చట్టంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.