Anchor Ravi: ఇటీవలే జీ తెలుగు(Zee telugu) ఛానల్ లో టెలికాస్ట్ అయిన ‘సూపర్ సీరియల్ ఛాంపియన్స్’ అనే ప్రోగ్రాం లో సుడిగాలి సుధీర్(Sudgaali Sudheer), సీనియర్ హీరోయిన్ రంభ(Heroine Rambha) చేసిన ఒక స్పూఫ్ ఎంత వివాదాస్పదంగా మారిందో మనమంతా చూసాము. హిందూ దేవుళ్లను అవమానించినట్టుగా ఈ స్పూఫ్ ఉందని కొన్ని హిందూ సంఘాలు సుడిగాలి సుధీర్ పై, మరియు ఆ షో ని నిర్వహిస్తున్న జీ తెలుగు ఛానల్ పై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఈ షోకి యాంకర్ గా రవి వ్యవహరించాడు. ఆయనకు హిందూ సంఘాల నుండి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయట. ఇలా చేయడం చాలా తప్పు, హిందూ దేవులపై చాలా ధైర్యం చేసేశారు, అదే ఇతర మతాల దేవుళ్లపై ఇలా చేయగలరా? అని అడిగారట. రోజురోజుకు వివాదం ముదురుతుండడంతో యాంకర్ రవి(Anchor Ravi) కాసేపటి క్రితమే క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు.
Also Read: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫుల్ మూవీ రివ్యూ…
ఆయన మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం. ఇటీవలే నేను, సుడిగాలి సుధీర్ మరియు ఇతర ఆరిస్ట్స్ తో కలిసి ‘సూపర్ సీరియల్ ఛాంపియన్స్’ అనే ప్రోగ్రాం లో ఒక స్పూఫ్ చేశాము. దీనికి కొంతమంది హిందువుల మనోభావాలను దెబ్బ తీసినట్టుగా అనిపించింది అంటూ మాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అలా చేయడం కరెక్ట్ కాదు అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. ముఖ్యంగా హిందువుల సెంటిమెంట్ ని దెబ్బ తీసే ఉద్దేశ్యంతో చేసినది అసలు కాదు. ఇది ఒక రైటర్ ని పెట్టుకొని, ప్రత్యేకంగా రాయించి చేసిన స్కిట్ కాదు. కేవలం ఒక సినిమాలోని సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తూ ఒక స్పూఫ్ మాత్రమే చేశాము. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా జాగ్రత్తగా ఉంటాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. జై శ్రీరామ్’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, రంభ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బావగారు..బాగున్నారా’ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి శివాలయం కి వచ్చి శివుడిని నందికొమ్ముల నుండి చూసేటప్పుడు రంభ అడ్డుగా వచ్చి నిలబడుతుంది. అప్పుడు చిరంజీవి శివుడికి బదులుగా రంభ ని చూస్తాడు. ఇదే సన్నివేశాన్ని సుడిగాలి సుధీర్, రంభ ఈ షోలో రీ క్రియేట్ చేశారు. దానికి కొన్ని హిందూ సంఘాలు మండిపడ్డాయి. కానీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాత్రం ఇందులో తప్పేమి ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవి చేసిన దానినే రిపీట్ చేసారు, చిరంజీవి చేస్తే తప్పు కానప్పుడు సుడిగాలి సుధీర్ చేస్తే తప్పు ఎందుకు అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇక నుండి హిందూ దేవుళ్ళ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.