Inter Results : ఏపీలో( Andhra Pradesh) ఇంటర్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈసారి ఫలితాలు ఇంటర్ వెబ్ సైట్ తో పాటుగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు.. హాయ్ అని మెసేజ్ పంపి ఫలితాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో క్షణాల్లో ఫలితాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. గత కొద్ది రోజులుగా ఇంటర్,10 పరీక్ష ఫలితాల కోసం లక్షలాదిమంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఆ ఉత్కంఠకు తెరపడనుంది.
Also Read : ఐడీబీఐ జాబ్ నోటిఫికేషన్–2025 : పోస్టులు, అర్హత, దరఖాస్తు వివరాలు..
* త్వరగా మూల్యాంకనం..
ఏపీలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు( inter exams ) జరిగాయి. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకనం ప్రారంభం అయ్యింది. ఇప్పటివరకు నాలుగు విడతల్లో మొత్తం మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. విద్యార్థుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా పూర్తయింది. దీంతో రేపు శనివారం ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతకంటే ముందే తెలంగాణ స్పందించింది. ఈనెల 24న ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు అక్కడ విద్యాశాఖ తెలిపింది. అయితే ఏపీలో వారం రోజులు ముందుగానే ఫలితాలు వస్తుండడం విశేషం.
* వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా
ఈసారి విద్యార్థుల కోసం వినూత్నంగా వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance ) విధానాన్ని అమలు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు కూడా అందులోనే జారీ చేశారు. ఇప్పుడు ఫలితాలు విడుదల కూడా అదే విధానంలో చేస్తున్నారు. అయితే ఈసారి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇంటర్ విద్యా విధానం మారింది. అకాడమిక్ క్యాలెండర్ సైతం మారింది. ఏప్రిల్ 3 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ఈనెల 23 వరకు కొనసాగనుంది. అక్కడ నుంచి వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 1న కాలేజీలు తెరుచుకోనున్నాయి.
Also Read : ముందస్తుగా ఇంటర్ అడ్మిషన్లు.. ప్రైవేట్ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందా?