Allu Arjun
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆయన కెరీర్ ని అతి క్లిష్టమైన సమయం నుండి కాపాడాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘అలా వైకుంఠపురంలో'(Ala Vaikuntapuram lo). త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలై, ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి ని డబుల్ మార్జిన్ తో క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా నుండే మన టాలీవుడ్ లో అల్లు అర్జున్ రూల్ మొదలైంది. ఈ సినిమాకి ముందు అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అల్లు అర్జున్ సినిమాకి ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చినా, మినిమం గ్యారంటీ వసూళ్లు వస్తాయి.
కానీ ఈ చిత్రానికి అది కూడా రాలేదు. ఫుల్ రన్ లో కనీసం 40 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమా ఇచ్చిన స్ట్రోక్ కి అల్లు అర్జున్ బాగా అలెర్ట్ అయ్యాడు. ఇక మీదట నా అభిమానులను కాలర్ ఎగరేసుకొని తిరిగే సినిమాలను మాత్రమే తీస్తానని సోషల్ మీడియా సాక్షిగా మాట ఇచ్చాడు. అలా వైకుంఠపురంలో మూవీ షూటింగ్ మొదలు అవ్వడానికి చాలా సమయమే పట్టింది. కానీ ఆలస్యం అయినా బెస్ట్ ఔట్పుట్ వచ్చే వరకు వదలలేదు బన్నీ. ఫలితం ఏంటో మనమంతా చూసాము,ఆరోజుల్లోనే ఈ చిత్రం 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఇక టీవీ టెలికాస్ట్ లో అయితే సంచలనం,ఏకంగా 30 రేటింగ్స్ వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇక నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండదట. రేపటి నుండి ఈ సినిమాని తొలగించేస్తున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చిన సినిమాని ఎందుకు తొలగిస్తున్నారు అనే సందేహం మీ అందరికీ రావొచ్చు. కానీ ఈ సినిమా నిర్మాతలతో నెట్ ఫ్లిక్స్ సంస్థ కేవలం 5 సంవత్సరాలు స్ట్రీమింగ్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి దొరికింది. రేపటి తో ఆ గడువు ముగుస్తుంది. మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ లోనే ఉంటుంది కానీ, ఎందుకో నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు రెన్యువల్ చేయించుకోడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఈ సినిమా ని కేవలం SUNXT యాప్ లో మాత్రమే చూడగలం. ఇకపోతే అలా వైకుంఠపురం లో తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక పీరియాడిక్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభం కానుంది.
Also Read : అల్లు అర్జున్ సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళడానికి ఎందుకు లేట్ అవుతుంది… దానికి అసలు కారణాలు ఏంటి..?