Trump Stopped Israel-Iran War : ఎట్టకేలకు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగింది. ఇంతకంటే ముఖ్యం ఏంటంటే.. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అత్యంత విజయవంతమైన శాంతి ఒప్పందం. ఇది సక్సెస్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ట్రంప్ చొరవతో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆగింది. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినట్టు ట్రంప్ ప్రకటించినా అది తప్పు అని భారత్ స్పష్టం చేసింది. కానీ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగి ఎట్టకేలకు కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించాడు.
అమెరికాకు ముందే చెప్పి ఇరాన్ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది. ఇజ్రాయెల్ కూడా దూకుడుగా ఉండడంతో ట్రంప్ హెచ్చరించి ఆపగలిగాడు. కాల్పుల విరమణకు ట్రంప్ ఒప్పించాడు.
ట్రంప్ మీడియేషన్ వల్లనే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగింది. ట్రంప్ ఇద్దరినీ కన్విన్స్ చేసి యుద్ధాన్ని ఆపడం గ్రేట్ అని చెప్పొచ్చు.
పశ్చిమాసియాలో ఒంటరిదైన కాగితపు పులి ఇరాన్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.