AP education system controversy 2025: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు ప్రతి అంశం రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. మొన్నటికి మొన్న సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా పాఠశాలల ఏర్పాటు అంశం రాజకీయంగా మారుతోంది. పాఠశాలలను సైతం రాజకీయాల్లోకి లాగుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట మండలం పెదపింకిలో మూడు పాఠశాలల్లో ఒకదానిని మోడల్ స్కూల్ గా మార్చారు. మరో పాఠశాలలోని మూడు, నాలుగు, ఐదు తరగతులను మూసివేశారు. పిల్లలు వేరే పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. పాత పాఠశాలనే కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తిరుగు ప్రయాణంలో ప్రమాదం..
అయితే గత నెల 23న ఈ పాఠశాల విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు కలెక్టరేట్ తో( collectorate) పాటు విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఇంతలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుబాట పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తర్వాత ఆ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఆ విద్యార్థులు సాయంత్రం తిరుగు ప్రయాణంలో లారీ ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు 10 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర సైతం దీనిపై దృష్టి పెట్టారు. అయితే మాజీ ఎమ్మెల్యే రాజకీయ నిరసన కోసం విద్యార్థులను తీసుకెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ కార్యాలయం దగ్గరకు పంపారని స్థానికులు చెబుతున్నారు.
ఓ నెటిజన్ ట్విట్
మరోవైపు ఈ ఘటనపై ఓ నెటిజన్ ట్వీట్( tweet) చేశారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.’ గౌరవనీయులైన విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్ద పెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. నిన్న యూనిఫాంలో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. ఎంఈఓ తో పాటు హెచ్ఎం ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఎంఈఓ తో పాటు హెచ్ఎం బాధ్యతరాహిత్యం పై విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ ఫిర్యాదు చేశారు.
Also Read: AP Education System: ఏపీలో విద్యావ్యవస్థ గాడిలో పడిందా?
వెంటనే స్పందించిన లోకేష్
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh)వెంటనే స్పందించారు. ఇది చాలా దారుణం నేరం కూడా.. దీనిపై సత్వర విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన రాజకీయ జోక్యం ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టారు. విచారణ చేపడుతున్నారు.
ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా… https://t.co/TVCjBASOWj
— Lokesh Nara (@naralokesh) June 24, 2025