https://oktelugu.com/

Supreme Court : సుప్రీంకోర్టు ధర్మాసనం SC వర్గీకరణకు సానుకూలంగా తీర్పు

అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రాలకు వర్గీకరణ చేసే బాధ్యత ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం SC వర్గీకరణకు సానుకూలంగా ఇచ్చిన తీర్పు పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : August 1, 2024 / 06:50 PM IST

Supreme Court : సుప్రీంకోర్టు ఈరోజు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది.. 20 సంవత్సరాల న్యాయపోరాటానికి ముగింపు పలికింది. 2004లో తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నయ్య కేసులో ఆరోజు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణను సీల్ చేసింది. దీనిపై న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. చివరకు ఈరోజు ఆ తీర్పు బయటకు వచ్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడు కలిపి మొత్తం ఏడుగురు న్యాయమూర్తుల్లో ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణ చేయవచ్చని.. రాష్ట్రాలకు అధికారం ఉంది.. ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. బేలా ఎం త్రివేది అనే న్యాయమూర్తి మాత్రం చేయటానికి లేదని చెప్పింది.

ఈ తీర్పులో ప్రధాన అంశాలంటే.. ఎస్సీల్లో సబ్ కేటగిరీలు చేయడం సరైనదా? కాదా? 2004లో చిన్నయ్య తీర్పు సరైనదా? కాదా? అన్న దానిపైనే వాదనలు జరిగాయి. చివరకు ఎస్సీల్లో సబ్ కేటగిరీ చేయవచ్చని ఆరుగురు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. చేయాలని తీర్పునిచ్చారు. వాళ్లకు అన్యాయం జరుగుతుందని తేలినప్పుడు ఎస్సీల్లో ఉప వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్పునిచ్చారు. గణాంకాలు.. జనాభా ఆధారంగా పేదరికం బేస్ చేసుకొని చేయాలని సూచించింది.

అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రాలకు వర్గీకరణ చేసే బాధ్యత ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం SC వర్గీకరణకు సానుకూలంగా ఇచ్చిన తీర్పు పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

సుప్రీంకోర్టు ధర్మాసనం SC వర్గీకరణకు సానుకూలంగా తీర్పు|Supreme Court  holds sub-classification of SC