https://oktelugu.com/

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం ఇదా.. రైతుబిడ్డ ముసుగులో అలాంటి పనులు, ఏకిపారేస్తున్న నెటిజెన్స్!

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో చాలా వినమ్రంగా ఉండేవాడు. నామినేషన్స్ రోజు మినహాయిస్తే తోటి కంటెస్టెంట్స్ తో సన్నిహితంగా మెలిగేవాడు. ఇక ఫిజికల్ టాస్క్ లలో పల్లవి ప్రశాంత్ తోపు. అందుకే అతడికి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. టైటిల్ గెలిచి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ తీరు పూర్తి భిన్నంగా ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 1, 2024 / 06:26 PM IST
    Follow us on

    Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో చేసిన ఎమోషనల్ డ్రామాలు అన్ని ఇన్ని కావు. రైతు బిడ్డ సెంటిమెంట్ తో జనాన్ని పిచ్చోళ్ళని చేసి టైటిల్ ఎగరేసుకుపోయాడు. తనని గెలిపిస్తే పేద రైతులను ఆదుకుంటానని కథలు చెప్పాడు. వచ్చిన ప్రైజ్ మనీ లో ఒక్క రూపాయి కూడా తన కోసం వాడుకోనని. తాను బతుకుతున్నదే రైతుల కోసం అంటూ భారీ డైలాగులు కొట్టాడు తీరా గెలిచిన తర్వాత చెప్పిన మాట మరిచాడు.

    వాగ్దానం గాలికి వదిలేశాడు. మొన్నామధ్య ఒక నిరుపేద కుటుంబానికి లక్ష రూపాయలు సాయం చేశాడు. గోరంత దానం చేసి కొండంత ప్రచారం చేసుకున్నాడు. సాయం గురించి నిలదీసిన వారిని తన గురువు శివాజీ చేత నోటికొచ్చిన మాటలు అనిపించాడు. మొదటి సాయం చేసి కూడా నెలలు గడుస్తుంది. ఇప్పటివరకు మరొకరికి డబ్బు పంచింది లేదు. ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. ఇప్పటికే సీజన్ 7 ముగిసి దాదాపు 8 నెలలు కావొస్తుంది. సీజన్ 8 కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది.

    ఇంకెప్పుడు ప్రశాంత్ డబ్బు పంచేది అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ ఇవేమి లెక్కచేయడం లేదు. ఫుల్ గా ఎంజాయ్ మూడ్ లోకి వెళ్ళిపోయాడు. టీవీ ఈవెంట్లు, షాప్ ఓపెనింగ్స్, సోషల్ మీడియా ద్వారా బాగా సంపాదిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా తన తోటి బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలసి పార్టీలు, డిన్నర్లు అంటూ చిల్ అవుతున్నాడు.

    సెలబ్రిటీ స్టేటస్ మైంటైన్ చేస్తూ ఎక్కడికి వెళ్లినా కారులో ఎంట్రీ ఇస్తున్నాడు. అందరికీ సెల్ఫీలు ఇస్తూ తెగ రచ్చ చేస్తున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల్లో పల్లవి ప్రశాంత్ ఇచ్చుకునే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఇటీవల తన పొలంలో పనులు చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ప్రశాంత్ పర్ఫామెన్స్ అయితే ఆస్కార్ లెవల్లో ఉంది. అయితే ఇది చూసిన నెటిజన్లు పల్లవి ప్రశాంత్ ని ఏకి పారేస్తున్నారు. నీ ఓవర్ యాక్షన్ చూసి మోసపోయాం .. నీకు అనవసరంగా ఓట్లు వేసి గెలిపించాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    పల్లవి ప్రశాంత్ పూర్తిగా తన లైఫ్ స్టైల్ మార్చేశాడు. ఒకప్పుడు వ్యవసాయం చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. గతంలో నిజాయితీగా పని చేస్తూ వీడియోలు చేసేవాడు. ఇప్పుడు కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు. బిగ్ బాస్ పుణ్యమా అని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్ కి ఫాలోవర్స్ పెరిగారు. దాంతో ఆదాయం కూడా పెరిగింది.

    బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ సైతం ఇలానే చేశాడు. కౌశల్ మంద తాను టైటిల్ గెలిస్తే రూ. 50 లక్షలు క్యాన్సర్ రోగులకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. తీరా టైటిల్ కొట్టి బయటకు వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. హ్యాపీగా వచ్చిన డబ్బు ఎంజాయ్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కూడా కౌశల్ నే ఫాలో అవుతున్నాడు. గట్టిగా అడిగితే హామీలు ఇచ్చి నెరవేర్చని రాజకీయ నాయకులను ఇలా అడగగలరా అని తిరిగి కౌంటర్ వేస్తున్నారు.