PM Modi at G7 Canada : జీ7 సమావేశం.. కెనడాలో జూన్ 15 నుంచి 17 వరకూ అల్బర్టా ప్రావిన్సులో జరుగబోతోంది. బ్రిటీష్ కొలంబియా పక్కనున్న ప్రావెన్స్. ముందుగా మోడీకి పిలుపురాలేదు. చివరి నిమిషంలో కాల్ వచ్చింది. అయినా మోడీ అటెండ్ కావడానికి నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇది వ్యూహాత్మక తప్పిదని అనిపిస్తోంది.
పోయిన సారి ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఎన్నికైంది. ఈ లిబరల్ పార్టీ తరుఫున గతంలో జస్టిన్ ట్రూడో అధ్యక్షుడిగా పనిచేశారు. ఈసారి మార్క్ కార్న్ లే ఇదే పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
కెనడా ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోతే 3 సీట్లు తగ్గిపోయాయి. ఖలిస్థానీ పార్టీ ఇచ్చిన మద్దతుతోనే లిబరల్ పార్టీ గెలిచింది. దీంతో భారత్ వ్యతిరేక ఖలిస్థానీలు ఇప్పుడు కెనడా ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఖలిస్థానీల మద్దతుతోనే కెనడాలో అధికారం సాధ్యమైంది.
కెనడాలో మోడీని పిలవకపోవడానికి ఖలిస్థానీ పార్టీలతో అధికార, ప్రతిపక్షాల పొత్తే కారణం. అందుకే భారత్ ను ఆహ్వానించడానికి తటపటాయించారు. ‘ఖలిస్థానీలు’ ఇప్పటికే మోడీని ‘పొలిటికల్ గా చంపేస్తాం’ అని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ కెనడా పర్యటన వ్యూహాత్మక తప్పిదమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.