Manipur violence : ఈశాన్య భారతం మోడీ పాలనలో ఎప్పుడు లేనన్నీ అద్భుతాలు సృష్టించింది. ఎన్ని ఉగ్రవాద సంస్థలు.. ఎన్ని వేర్పాటు వాద సంస్థలు ఆయుధాలు వదిలి ప్రజాస్రవంతిలోకి వచ్చాయి. ఎప్పుడూ లేనంత మౌలిక సౌకర్యాలు ఈశాన్య భారతంలో జరిగాయి. అంతకుముందు విస్మరించారు.
కానీ మోడీ పాలనలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు సహా అభివృద్ధి అంతా గడిచిన 10ఏళ్లలో జరిగింది. మణిపూర్ శాంతి భద్రతలు,అల్లర్లు మోడీ పాలనకు మాయని మచ్చలా మిగిలిపోయాయి.
మిగతా చోట్ల ఇలాంటి పరిస్థితులున్నాయి. మణిపూర్ లో మూడు ప్రధాన జాతుల మధ్య ఘర్షణతో నలిగిపోతున్నారు. మైతీలు, కుకీలు,నాగాలు కొట్టుకుంటున్నారు.
50 శాతం మైతీలు కేవలం 10 శాతం భూభాగంలో ఉన్నారు.కుకీలు అడవులన్నీ నరికేసి విస్తరిస్తున్నారు. హైకోర్టు మైతీలను ఎస్టీలుగా గుర్తించడంతో వివాదం మొదలైంది. కుకీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తేవడం వివాదానికి కారణమైంది. ఒక జో రాష్ట్రం కోసం అంతర్జాతీయ కుట్ర ఇక్కడ జరుగుతోంది. దీనికి పరిష్కారం ఏంటి?
మణిపూర్ లో కఠినంగా వ్యవహరించకపోతే నష్టం తీవ్రం తప్పదు. అక్కడి పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.