Experiment: సాధారణంగా ప్రయోగాలు అంటే ఒక రెండేళ్లు, మూడేళ్లు లేదా పదేళ్లు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో ఓ ప్రయోగం వందేళ్ల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లోని పిచ్ డ్రాప్ ప్రయోగాన్ని 1927లో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ థామస్ పార్నెల్ ప్రారంభించారు. ఇతను విశ్వ విద్యాలయంలో మొదటి భౌతికశాస్త్ర ప్రొఫెసర్. ఇతను ప్రారంభిరంచిన ఈ ప్రయోగం 1927 నుంచి ఇంకా కొనసాగుతుండంతో ఈ వైజ్ఞానిక ప్రయోగానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ఈ ప్రయోగం పిచ్ నెమ్మదిగా ప్రవహించే స్వభావాన్ని వివరిస్తుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద దృఢంగా కనిపించినప్పటికీ, పిచ్ నిజానికి చాలా జిగట ద్రవంగా ఉంటుంది. అయితే మొదట్లో ఈ ప్రయోగాన్ని ఒక శతాబ్దం మాత్రమే అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది. ఇది కేవలం శతాబ్దానికే కాకుండా ఇంకా 100 సంవత్సరాల పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 1927లో ప్రారంభమైన ఈ డ్రిప్ ప్రయోగం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది.
పార్నెల్ ఈ పిచ్ డ్రాప్ ప్రయోగంలో రోజు మనం వాడే పదార్థాలు చాలా ఆశ్చర్యకరమైన లక్షణాలను ప్రదర్శించగలవని వివరించడానికి రూపొందించారు. ఇందులో ఉపయోగించిన పిచ్ అనే పదార్థాన్ని తారు నుంచి తీసుకున్నారు. ప్రపంచంలోనే దీన్ని అత్యంత మందపాటి ద్రవంగా పిలుస్తారు. ఒకప్పుడు దీన్ని వాటర్ ఫ్రూఫింగ్ బోట్‌ల కోసం ఎక్కువగా వాడేవారు. పిచ్ చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. నీటి కంటే 100 బిలియన్ రెట్లు ఎక్కువ జిగటగా ఉంటుంది. పార్నెల్ ఈ పిచ్ నమూనాను వేడి చేసి, మూసి వేసిన కాండంతో గాజు గరాటులో వేశారు. పిచ్ చల్లారిన తర్వాత 1930లో గరాటు కాండం కోయడానికి ప్రయత్నించాడు. ఇలా పిచ్ నుంచి గరాటు బయటకు రావడం ప్రారంభమైంది. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరిగింది. మొదటి డ్రిప్ పడిపోవడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. మరో ఐదు డ్రిప్‌లను కూడా ఇలా చేయడానికి 40 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది.
ఈ ప్రయోగానికి ఎలాంటి కండీషన్లు ఉండవు. సాధారణ క్యాబినెట్‌లో కూడా దీన్ని ప్రదర్శిస్తారు. అయితే పిచ్ ఉష్ణోగ్రతను బట్టి డ్రిప్ వేగం ఉంటుంది. ఈ డ్రిప్ ప్రయోగాన్ని ఎవరు ఇప్పటి వరకు చూడలేదు. దాన్ని ఫొటో తీయడానికి 2000లో కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. కానీ అది రికార్డు కాలేదు. అయితే 1961 నుంచి ఈ ప్రయోగాన్ని ప్రొఫెసర్ జాన్ మెయిన్‌స్టోన్ 52 ఏళ్ల పాటు చూసుకున్నారు. పార్నెల్, మెయిన్‌స్టోన్‌కి మరణం తర్వాత 2005లో నోబెల్ బహుమతి లభించింది. ఇద్దరూ కూడా ఆ ప్రయోగం చూడకుండానే మరణించడంతో వారి సేవకు గుర్తింపుగా మరణం తర్వాత నోబెల్ బహుమతి వరించింది. ఇన్నేళ్ల పాటు ఈ ప్రయోగం జరగడం వల్ల ఇది గిన్నిస్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది.