Operation Sindoor : సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను పదో తేదీ సాయంత్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్టివ్ చేసింది. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే.. 10వ తేదీ భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణతో 1971 యుద్ధంతో పోలుస్తూ ఇందిరతో పోల్చితే మోడీ కి ఆ ధైర్యం లేదని విమర్శలు గుప్పించింది.
1971 బంగ్లాదేశ్ యుద్ధం ఒక అంతర్జాతీయ స్థాయి సాయుధ పోరాటం. ఇందులో రెండు ప్రధాన దేశాలు (భారతదేశం మరియు పాకిస్తాన్) నేరుగా పాల్గొన్నాయి. లక్షలాది మంది సైనికులు, పౌరులు ప్రభావితమయ్యారు. ఇది ఒక భూభాగం స్వాతంత్ర్యం కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం జరిగిన మహా సంగ్రామం. శరణార్థుల సంక్షోభం, సైనిక చర్యల తీవ్రత అపారమైనవి.1971 బంగ్లాదేశ్ యుద్ధం: ఇది ఒక దేశం (బంగ్లాదేశ్) ఏర్పడటానికి దారితీసిన విమోచన యుద్ధం మరియు ఒక సంప్రదాయ అంతర్జాతీయ యుద్ధం. తూర్పు పాకిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన అకృత్యాలకు వ్యతిరేకంగా ముక్తి బాహిని గెరిల్లా పోరాటం, ఆపై భారతదేశం జోక్యం చేసుకుని సంయుక్త సైనిక చర్య జరపడం దీనిలో భాగాలు.
అయితే ఆపరేషన్ సిందూర్ అనేది మన దేశంలోకి వచ్చి ఉగ్రవాదులు చేసిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని అంతచేయడం ఉద్దేశం. పహల్ గాంలో అమాయకపౌరులపై ఉగ్రవాదులు చంపేశారు. ఉగ్రవాదంపై మోడీ టార్గెట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ ని 1971 బంగ్లాదేశ్ యుద్ధంతో ఎందుకు పోల్చలేం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చ.