Balakrishna And Boyapati: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu)…ఆయన చేసిన ప్రతి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా సెంటిమెంట్ ని కూడా సమపాళ్లలో రంగరించి ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చే సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా రిపీటెడ్ గా ఆయన సినిమాలను చూసే విధంగా ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి…మొత్తానికైతే బోయపాటి ఆయన కెరీర్లో చాలావరకు సక్సెస్ లను సాధించాడు. ఆయన ఏ హీరోతో సక్సెస్ ని సాధించిన సాధించకపోయినా కూడా బాలయ్య బాబుతో మాత్రం వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు అఖండ 2 (Akhanda 2) సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికి బాలయ్య బాబు(Balayya Babu) కి, బోయపాటి శ్రీను(Boyapati Srinu) కు మధ్య కొంతవరకు కొన్ని విబేధాలైతే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. ఇక అందులో భాగంగా వాళ్ళిద్దరి మధ్య కొన్ని విబేధాలు వచ్చినట్టుగా కనబడుతున్నాయట. ఒకప్పుడు బాలయ్య బాబు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సింహా, లెజెండ్, అఖండ లాంటి భారీ సక్సెస్ లను అందించిన బోయపాటి ఇప్పుడు బాలయ్య బాబు సక్సెస్ లో ఉన్నాడు.
Also Read: అక్షరాలా 450 రోజులు..చరిత్ర తిరగరాసిన ‘సలార్’..ప్రపంచం లోనే మొదటి సినిమా!
కాబట్టి బాలయ్య కూడా స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేయమని అడిగినట్టుగా తెలుస్తోంది. మరి బోయపాటి సైతం దానికి ఒప్పుకున్నప్పటికి షూటింగ్లో కూడా బాలయ్య కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నాడట. ఇక వాటిలో కొన్ని పాటిస్తూ మరికొన్ని వదిలేస్తున్నాడట… దానివల్లే బాలయ్య కి బోయపాటి వైఖరి నచ్చడం లేదట.
అయినప్పటికి బాలయ్య కామ్ గానే ఉంటున్నాడట. ఇక ఈ విషయాలను పక్కన పెడితే బోయపాటి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమాతో బాలయ్యకి మరో భారీ సక్సెస్ ని సాధించి పెడతాడనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక బాలయ్య బాబు అభిమానులు సైతం ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక షూటింగ్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఇద్దరు శరవేగంగా షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి వీళ్ళిద్దరు ఎవరు మీద ఎవరు కోపానికి వచ్చి పక్కనున్న వాళ్ళ మీద అరుస్తారో అని పక్కన ఉన్న వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారట. ఇద్దరు కూడా ఎవరికివారు భారీ సక్సెస్ లను సాధించి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న వారే కావడం విశేషం…