Northeast India States : ఈశాన్య భారతం.. దానికి మరో పేరు ‘అష్ట లక్ష్మి’.. 8 రాష్ట్రాలు.. అభివృద్ధిలో అంగలేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఒకసారి మౌళిక సదుపాయాలు ఏర్పడితే ఆటోమేటిక్ గా అన్నీ జరుగుతాయి. ఉదాహరణకు హైవేలు తీసుకుంటే.. 65 ఏళ్లలో 10వేల కి.మీలు వేస్తే.. ఒక్క మోడీ 11 సంవత్సరాల్లో 6 వేల కి.మీలు నిర్మించాడు.
ఒకనాడు 1 వాటర్ వేవ్ లు ఉంటే ఈరోజు 20 వచ్చాయి.. రైల్వేలు 2వేల కి.మీలు విస్తరించడమే కాకుండా అన్ని ఈశాన్య రాష్ట్రాల రాజధానులకు లింక్ ఇచ్చారు. మిజోరం, మణిపూర్ రాష్ట్రాలకు వచ్చాయి. ఒకనాడు 9 ఉంటే ఇవాళ 17 ఎయిర్ పోర్టులు వచ్చాయి.
లా అండ్ ఆర్డర్ ఒక్క మణిపూర్ తప్పిస్తే.. ఎప్పుడూ లేనంతగా శాంతి భద్రతలు కొనసాగుతాయి. ఏరోజు శాంతి భద్రతలు లేని ప్రాంతమదీ.. తీవ్రవాదులు లొంగి.. ఆయుధాలు సరెండర్ చేసి మణిపూర్ తప్ప అన్ని రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అమలు చేస్తున్నారు.
పెట్టుబడులు అంగలేస్తూ అడుగులు వేస్తున్నారు. భారత మండపం అన్న చోట మే 23, 25 లలో ఈశాన్య రాష్ట్రాల్లో 4.35 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంబానీ, అదానీ, వేదాంత లు భారీగా పెట్టుబడులు పెట్టారు. టాటా 27వేల కోట్లతో ఫ్యాబ్ చిప్ పరిశ్రమ పెడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో హైడ్రో జల విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. గౌహతి 7వ బిజియెస్ట్ ఎయిర్ పోర్టుగా అభివృద్ధి చెందుతోంది. సిక్కిం, మేఘాలయలో భారీగా టూరిజం అభివృద్ధి చెందుతోంది.
ఈశాన్య భారతం అంగలేస్తూ అభివృద్ధి బాటలో పైపైకి.. ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.