India vs Pakistan : మోడీ నిర్ణయాలు ఎవరీ ఊహకు అందనంత ఎత్తులో ఉంటాయి. సౌదీ నుంచి రాగానే ఎయిర్ పోర్టులోనే సమావేశం నిర్వహించి కీలకనిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి పాకిస్తాన్ పై నీటి యుద్ధాన్ని ప్రకటించారు. ఎవరి ఊహకు అందని విషయం ఇదీ.. నీటి యుద్ధం అనేది చాలా పవర్ ఫుల్. ఆయుధాలతో జరపడానికి వార్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అందుకే ప్రధానమైన సిందూ నదీ నీటి ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు.దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు.
ఎందుకు అసలు ఇది ఆయువు పట్టు అంటే.. సింధూ నది లేకపోయింటే పాకిస్తాన్ లేదు. సింధూ, సరస్వతి నదులే పాకిస్తాన్ జీవనాధారం. పాకిస్తాన్ చేసే వ్యవసాయంలో 90 శాతం సింధూ నది ఇరిగేషన్ మీదనే ఆధారపడి ఉంది. భారత్ నుంచే వచ్చే నీళ్లే 70 శాతం నీరు ఉంది. పాకిస్తాన్ లో 24శాతం హైడ్రో పవర్ సింధూ నదిమీద ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఎగుమతుల్లో 60 శాతం, ఉద్యోగాల్లో 40 శాతం సింధూనది మీద ఆధారపడి ఉంది.
1960లో వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సింధూ నది ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య సాగింది. మొత్తం నీటిలో 30శాతం భారత్ కు, 70 శాతం పాకిస్తాన్ కు దక్కేలా ఒప్పందం జరిగింది. పాకిస్తాన్ లో ఇప్పటికే పంజాబ్, సింధూ మధ్య నీటి కాలువల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు మోడీ సింధూ నదిని ఆపేస్తే మరింతగా పాకిస్తాన్ కరువుతో అల్లాడడం ఖాయం.
పాకిస్తాన్ ఆయువు పట్టు సింధూ నది నీటిలో వుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
