https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ చెప్పిన దానికి సీఎం పోలీసులు చెప్పిన దానికి తేడా ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్ విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నాడన్నది ప్రశ్న. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ మాట్లాడలేదు. అల్లు అర్జున్ ను విలన్ లా రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి మాట్లాడడం పద్ధతి కాదు.

Written By: , Updated On : December 23, 2024 / 08:56 PM IST

Allu Arjun : ఒక దుర్ఘటనను రాజకీయ నాయకులు ఎలా దుర్వినియోగం చేస్తారో.. ఎలా ఉపయోగించుకుంటారో ప్రత్యక్ష ఉదాహరణ ‘సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన..’.. ఇది అనుకోకుండా జరిగింది. విచారణ ఘటన.. నిండు ప్రాణం కోల్పోయింది. బాలుడు ఆస్పత్రిలో ఉన్నాడు. ఎవరికీ కూడా ఈ విషయంలో వ్యతిరేకత లేదు. సానుభూతినే ఉంది.

అయితే ఈ సంఘటనను అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్ష టీఆర్ఎస్ లు వారి స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పక్షం ఇంతగా దీన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. దుర్ఘటన జరిగిన తర్వాత ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇన్ స్టంట్ కామెంట్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓపెన్ గా ఎగ్రెసివ్ గా మాట్లాడారు. సినిమా వాళ్లు లాభాల కోసం.. కోట్లు సంపాదించేందుకు వస్తారని ఇండియా టుడే ఇంటర్వ్యూలో నోరుపారేసుకున్నారు. సినిమా అంటే డబ్బు సంపాదనయేనా? కళ కోసం కాదా? అన్న డౌట్లు అందరికీ రేవంత్ వ్యాఖ్యలతో వచ్చాయి. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి సినిమా కళను అవమానించినట్టే..

అల్లు అర్జున్ విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నాడన్నది ప్రశ్న. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ మాట్లాడలేదు. అల్లు అర్జున్ ను విలన్ లా రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి మాట్లాడడం పద్ధతి కాదు. ఇది కావాలనే ప్రశ్న వేసుకొని మాట్లాడినట్టు కనిపిస్తోంది. అటువంటి వాతావరణం సీఎం క్రియేట్ చేస్తే తెల్లవారి అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు.

అల్లు అర్జున్ చెప్పిన దానికి సీఎం పోలీసులు చెప్పిన దానికి తేడా ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

అల్లు అర్జున్ చెప్పిన దానికి సీఎం పోలీసులు చెప్పిన దానికి తేడా ఏంటి? | CM Revanth Reddy | Allu Arjun