Suma-Rajeev Kanakala
Suma-Rajeev Kanakala : బుల్లితెర పై తన కామెడీ టైమింగ్ తో, చురుకైన మాటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే యాంకర్స్ లో ఒకరు సుమ కనకాల. రెండు దశాబ్దాల నుండి ఆమె యాంకరింగ్ రంగం లో కింగ్ గా కొనసాగుతూ వస్తుంది. అంతే కాకుండా చిన్న హీరోల సినిమాల దగ్గర నుండి పెద్ద హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు సుమ నే యాంకర్ గా వ్యవహరించాలి. ఆ రేంజ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది ఆమె. మధ్యలో ఎంతో మంది కొత్త యాంకర్స్ పుట్టుకొచ్చారు కానీ, సుమ స్థానాన్ని మాత్రం రీ ప్లేస్ చేయలేకపోయారు. అయితే సుమ ఈమధ్య కాలం లో టీవీ షోస్ బాగా తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె ఈటీవీ లో ప్రసారమయ్యే సుమ అడ్డా అనే షో చేస్తుంది. ఇంతకు ముందు శనివారం రోజు ప్రసారమయ్యే ఈ షో, ఇప్పుడు మంగళవారం ప్రసారం అవుతుంది. ఈ మంగళవారం, అనగా రేపు ప్రసారం అవ్వబోయే ఈ ఎపిసోడ్ కి సుమ భర్త రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, హైపర్ ఆది, యాంకర్ సౌమ్య రావు, నూకరాజు, ఇమ్మాన్యుయేల్, అరియానా, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
కామెడీ ని పండించే వీళ్లంతా ఒక్క చోట ఉంటే ఏ రేంజ్ సందడి ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో కూడా మన ఊహలకు తగ్గట్టుగానే ఉంది. హైపర్ ఆది వేసిన పంచులు, వచ్చి రాని తెలుగు తో నవ్వు రప్పించే యాంకర్ సౌమ్య, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ చేసిన కామెడీ, ఆటో రామ్ ప్రసాద్ ఆటో పంచులు, ఇలా ఉండాల్సినవన్నీ ఈ ఎపిసోడ్ లో ఉన్నట్టుగా ఈ ప్రోమో ని చూసినప్పుడు అనిపించింది. అలా సరదాగా సాగిపోతున్న ఈ ఎపిసోడ్ చివర్లో మొత్తం ఎమోషనల్ గా మారిపోతుంది. రాజీవ్ కనకాల బోరుమని ఏడ్చేశాడు. అతని బాధని చూసి బ్రహ్మాజీ, సుమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.
ఇంతకీ అసలు ఏమైందంటే ఈ ఎపిసోడ్ చివర్లో రాజీవ్ కనకాల తల్లిదండ్రులు దేవదాస్ కనకాల, లక్ష్మి కనకాల కి సంబంధించిన విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల తన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని, వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ తో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేశాడు. ఎప్పుడూ ఎంతో సరదాగా ఉండే బ్రహ్మాజీ కూడా ఎమోషనల్ అవుతూ వాళ్ళతో తనకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను రాజీవ్ కనకాల తల్లిదండ్రులను మేడం, మాష్టారు అని పిలిచేవాడిని. ఈరోజు నేను ఇండస్ట్రీ లో ఈ స్థాయికి వచ్చానంటే, వాళ్లిద్దరూ నాకు నేర్పించిన నటనే కారణం. ఎంతోమంది లెజండరీ నటులను ఇండస్ట్రీ లోకి వచ్చేలా చేసిన మాహానుబావులు వాళ్లిద్దరు’ అంటూ బ్రహ్మాజీ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.