Caste Census : ఏప్రిల్ 30న ఒక చరిత్రాత్మక దినంగా నిలిచిపోతోంది. మోడీ ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేయాలని నిర్ణయించింది. ఎందుకు చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
భారత్ లో కులాన్ని విస్మరించలేం. హిందూమతంలోనే కాదు..క్రిస్టియన్, ముస్లింలలో కూడా కుల ప్రస్తావన ఉంది. బ్రిటీష్ ప్రభుత్వం 1851లో సమగ్ర జనాభా లెక్కల సేకరణను చేపట్టింది. 1931 వరకూ బ్రిటీష్ ప్రభుత్వం జనాభా లెక్కలు జరిపినప్పుడల్లా కులగణన కూడా చేపట్టేవారు. బ్రిటీష్ వారు జనాభా లెక్కల్లో కాస్ట్ లెక్కలు తీసేవారు.
స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జనాభా లెక్కలు నిర్వహించారు. మొట్టమొదటి సెన్సాస్ లో బ్రిటీష్ వారి కులగణన అవసరం లేదని నెహ్రూ ప్రభుత్వం తీసివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కులగణనను దేశంలో ఆపేసింది.
చరిత్ర తెలియకుండా రాహుల్ గాంధీ ఇప్పుడు బీజేపీని నిందిస్తున్నారు. 1951, నుంచి 2011 వరకూ జనాభా లెక్కలు జరిగాయి. 2011 జనాభా లెక్కల్లో కులగణనను ఎందుకు చేపట్టలేదో సమాధానం ఇవ్వాలి. అందరి ఒత్తిడితో సర్వే చేపట్టింది.
కుల గణనపై మోడీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.