Hit 4: దర్శకుడు శైలేష్ కొలను 2020లో హిట్ సిరీస్ స్టార్ట్ చేశాడు. శైలేష్ కొలనుకి హిట్ డెబ్యూ మూవీ. నాని నిర్మాతగా మారి ఈ మూవీ నిర్మించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందించారు. హిట్ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. హిట్ సక్సెస్ కావడంతో, హిట్ 2 తెరకెక్కించారు. హిట్ 2 లో అడివి శేష్ హీరోగా నటించాడు. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన రెండో భాగం సైతం విజయం అందుకుంది. హిట్, హిట్ 2 చిత్రాలను నిర్మించిన నాని, హిట్ 3లో స్వయంగా నటించారు. అర్జున్ సర్కార్ అనే మోస్ట్ వైలెంట్, రూత్ లెస్ పోలీస్ అధికారి రోల్ చేశాడు.
Also Read: కార్మికుల దినంపై ఆ హీరో కామెంట్స్ .. ఎవ్వరూ ఊహించని వీడియో!
హిట్ 3 మూవీ మే 1న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కుతుంది. కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. హిట్ సిరీస్లో మొత్తం 8 సినిమాలు వస్తాయని ఇప్పటికే యూనిట్ తెలియజేశారు. హిట్ 2 క్లైమాక్స్ లో హిట్ 3లో నటించే హీరోని పరిచయం చేశారు. హిట్ 3 విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. హిట్ 4లో నటించే హీరో ఎవరో తెలియజేశారు. ఓ స్టార్ హీరో హిట్ 3 క్లైమాక్స్ లో కేమియో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనెవరో కాదు, కార్తీ.
తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూస్తారు. హిట్ 3 క్లైమాక్స్ లో కార్తీ పవర్ఫుల్ ఎంట్రీ అదిరింది. ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లోకి కార్తీ ఎంట్రీ ఇవ్వడం బాగుంది. ఈ క్రమంలో హిట్ 4 పై అంచనాలు పెరిగిపోయాయి. అదే సమయంలో హిట్ సిరీస్ లో వచ్చే చిత్రాల బడ్జెట్ పెరుగుతూ పోతుంది. మొదట్లో విశ్వక్, అడివి శేష్ వంటి చిన్న హీరోలతో హిట్ సిరీస్ చేశారు. నాని, కార్తీ వంటి బడా హీరోలు రావడంతో హిట్ సిరీస్ కి ప్రాధాన్యత మరింత పెరిగింది.
Karthi’s cameo as Rathnavel Pandian in #HIT3 was a total show-stealer! ♂️ That powerful entry has us hyped for what’s next. Bring on #HIT4! #Nani #SrinidhiShetty #SaileshKolanu#HIT3TheThirdCase #HIT3 pic.twitter.com/GvThz38uBf
— Movie Munch (@dailyaffairs12) May 1, 2025
ఇక ఒక పార్ట్ అందరు హీరోలు కనిపిస్తారని టాక్. కాగా కార్తీ కెరీర్లో ఖాకీ అద్భుతమైన చిత్రంగా ఉంది. ఆ మూవీలో ఆయన సీరియస్ పోలీస్ రోల్ చేశాడు. సర్దార్ మూవీలో సైతం కార్తీ పోలీస్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. హిట్ 4లో కార్తీ పేరు ఏసీపీ వీరప్పన్ కావడం విశేషం. వచ్చే ఏడాది హిట్ 4 విడుదలయ్యే అవకాశం కలదు. మరోవైపు నిర్మాతగా కూడా నాని రాణిస్తున్నాడు. ఆయన నిర్మించిన కోర్ట్ మూవీ భారీ విజయం అందుకుంది. నానికి విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది.
Also Read: ఇలాంటి ప్రవర్తన ఎవరైనా అనుమతిస్తారా? పెద్ది హీరోయిన్ జాన్వీ సీరియస్