Caste Census : 2025 ఏప్రిల్ 30వ తేదీ. చరిత్రలో నిలిచిపోయే రోజు. 95 సంవత్సరాల తర్వాత కులగణనకు మోడీ ప్రభుత్వం పూనుకుంది. సమాజంలో పుట్టుకతో పాటు వెనుకబాటుతనాన్ని కొలవడానికే ఈ కులగణన.. తర్వాత ఏం చేయాలి.
1931 తర్వాత మొట్టమొదటి సారి కులగణన జరుగబోతోంది. సామాజిక ఆర్థిక వెనుకబాటు తనం కారణంగా.. కులగణన ప్రకారం సంక్షేమ పథకాలు వెనుకబడిన వర్గాలకు అందించేందుకు మోడీ సర్కార్ ఈ కులగణన చేస్తున్నారు. ఉన్న రిజర్వేషన్లను క్రమబద్దీకరించేందుకు ఈ కులగణన ఉపయోగపడనుంది.
మోడీ నిర్ణయం సాధ్యమేనా? అమలు జరుగుతుందా? మనం అనుకున్న పద్ధతిలో అంటే ఆలోచించాలి. రోహిణి కమిషన్ 2017లో వేశారు. 2023లో రోహిణి కమిషన్ నివేదిక ఇచ్చారు. 11 పేజీల నివేదికలో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాల వచ్చాయి. 2036 కులాలు ఉన్నాయి. 26 శాతం కులాలే 97 శాతం రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నాయి. మిగతా 74 శాతం కులాలు 3 శాతం ఫలాలను అనుభవిస్తున్నాయి. 900 కులాలకు ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవించడం లేదు.
కుల గణన తదనంతర పర్యవసానాల్ని మోడీ సమర్థంగా ఎదుర్కోగలడా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.