IPL 2025: ప్రస్తుత ఐపీఎల్ లో చెన్నై జట్టు, రాజస్థాన్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాయి. అఫీషియల్ గా ఎలిమినేట్ అయ్యాయి. వాస్తవానికి ఈ మూడు జట్లపై భారీగానే అంచనాలు ఉండేవి. అయితే వాటిని అందుకోవడంలో ఈ మూడు జట్లు విఫలమయ్యాయి. అందువల్లే గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి.. చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ సారథ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ కెప్టెన్ గా ఉన్నాడు.. చెన్నై జట్టు అసలు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో.. అతని స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా ధోని నియమితుడయ్యాడు. ధోని నాయకత్వం వహించినప్పటికీ చెన్నై జట్టు విజయాల బాట పట్టలేకపోయింది. ఇక రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ గాయాల బారిన పడిన నేపథ్యంలో.. అతడి స్థానంలో రియాన్ పరాగ్ కు అవకాశం వచ్చింది. కానీ అతని ఆధ్వర్యంలో కూడా రాజస్థాన్ జట్టు విజయాలు సాధించలేకపోయింది. మొత్తంగా చూస్తే ఈ మూడు జట్లు సమష్టి వైఫల్యం వల్ల ఐపిఎల్ లో గ్రూప్ దశనుంచే నిష్క్రమించాయి.
Also Read: ఐపీఎల్ లో అతడి దూకుడు వెనుక నాన్న.. కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తున్న క్రికెటర్ స్టోరీ..
చెత్త క్రికెట్ కెప్టెన్ గా అతడు
ఐపీఎల్ లో రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై తర్వాత ఆ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నది లక్నో జట్టు.. రిషబ్ పంత్ లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుత ఐపిఎల్ లో హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ గా ఇతడు కొనసాగుతున్నాడు. ఇతడి కోసం లక్నో యాజమాన్యం ఏకంగా 27 కోట్లు ఖర్చు చేసింది. అయితే కెప్టెన్ గా రిషబ్ పంత్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆటగాడిగా కూడా అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. అయితే అతడి చెత్త ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని ఐస్ లాండ్ క్రికెట్ టీం ఒక జట్టును ఏర్పాటు చేసింది. ఆ జట్టుకు కెప్టెన్ గా పరిషత్ పంతును ఎంపిక చేసినట్టు ట్వీట్ చేసింది.. రిషబ్ పంత్ మాత్రమే కాదు, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాటి, మాక్స్ వెల్, రచిన్ రవీంద్ర, వెంకటేష్ అయ్యర్, లివింగ్ స్టోన్, రవిచంద్రన్ అశ్విన్, మతిష పతిరణ, మహమ్మద్ షమీ, దీపక్ హుడా తో ప్రాడ్స్ & స్కామర్స్ పేరుతో ఒక జట్టును ప్రకటించింది. ” ఎన్నో అంచనాలు ఉన్న వీరు ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యారు. వీరి గత ప్రదర్శన చూసి ఆ యాజట్ల యాజమాన్యాలు కోట్లకు కోట్లు వీరి మీద కుమ్మరించాయి.. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వీరంతా విఫల ప్రదర్శన చేయడ వల్ల.. వీరిని మాత్రమే నమ్ముకున్న ఆ జట్ల యాజమాన్యాలు నిండా మునిగాయి. ఇప్పుడు వీరు సరిగ్గా ఆడకపోవడం వల్ల.. ఏకంగా ఐస్ ల్యాండ్ క్రికెట్ టీం ఒక జట్టును ఏర్పాటు చేసింది. పైగా దానికి మోసకారులు, కుయుక్తులు పన్నేవారు అనే పేరు పెట్టింది. ఇంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. ఇప్పటికైనా ఆటగాళ్లు తమ ఆట తీరు మార్చుకుంటేనే బాగుంటుందని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: పదేళ్ల దరిద్రాన్ని..ఒక్క సీజన్ లో మార్చేశాడు.. ప్రీతి జింటా హగ్ ఇవ్వాల్సిన సందర్భం!