BJP : బీజేపీకి దారేది?

సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని కమలనాథులు భావిస్తున్నారు. అయితే కేంద్రం ఎన్నికలు వాయిదా వేస్తే న్యాయపోరాటం చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

Written By: NARESH, Updated On : June 9, 2023 9:23 pm
Follow us on

BJP : మొన్నటిదాకా సౌత్ లో కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే బిజెపి అధికారంలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించడంతో బిజెపి సున్నాకు పరిమితమైంది.. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలిచి అదే ఊపును తెలంగాణలో కూడా కొనసాగించాలని బిజెపి నాయకులు తల పోశారు. కానీ వారు అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి.. ప్రధానమంత్రి స్థాయి లాంటి వ్యక్తులు కూడా ప్రచారం చేసినప్పటికీ కర్ణాటకలో బిజెపి ఓటమిని తప్పించలేకపోయారు. అవినీతి, ప్రతి దాంట్లో మితిమీరిపోయిన రాజకీయ జోక్యం భారతీయ జనతా పార్టీ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఓడిపోవడంతో దక్షిణాదిలో బిజెపి పుంజుకోవడం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

త్వరలో గడువు ముగిసే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, మిజోరాంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. రాజస్తాన్, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని కమలనాథులు భావిస్తున్నారు. అయితే కేంద్రం ఎన్నికలు వాయిదా వేస్తే న్యాయపోరాటం చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

ఈ క్రమంలోనే దక్షిణాదిలో పొత్తులతోనా, స్వంతగా వెళ్లాలా? అన్న దానిపై బీజేపీ తేల్చుకోలేకపోతోంది.