https://oktelugu.com/

Health Juice : దీన్ని రోజు తాగితే అనారోగ్య సమస్యలు దూరమే

ఈ చిట్కా పాటిస్తున్నప్పుడే కాల్షియం లోపం లేకుండా చేసే ఆహారాలు తీసుకోవడం మంచిది. విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే రోజు ఉదయం ఎండలో ఉండటం చాలా మంచిది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 9, 2023 3:20 pm
    Follow us on

    Health Juice : ఈ రోజుల్లో కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు సహజంగా మారిపోయాయి. వయసు మళ్లిన వారికి ఇవి నిత్యకృత్యంగా మారాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. ఎలా తగ్గించుకోవాలో తెలియడం లేదు. కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు శబ్ధాలు వస్తుంటాయి. కీళ్ల మధ్య జిగురు తగ్గిపోయి కీళ్లు రాపిడికి గురికావడంలో నొప్పి తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో వాటిని తగ్గించుకోవడానికి చిట్కాలు కూడా ఉన్నాయి.వాటిని పాటించి నొప్పులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

    మన ఇంట్లో దొరికే వాటితోనే చక్కనైన మందు తయారు చేసుకోవచ్చు. దీంతో వాటిని దూరం చేసుకోవచ్చు. వాత, కఫ దోషాలను లేకుండా చేసుకోవచ్చు. దీనికి 50 గ్రాముల శొంఠిని తీసుకోవాలి. 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వాము తీసుకోవాలి. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన మోతాదులో ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి.

    ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. షుగర్ ఉన్న వారు బెల్లం వేసుకోవద్దు. ఈ మిశ్రమాన్ని అల్పాహారానికి ఓ అర గంట ముందు తాగాలి. ఇలా 15 రోజుల పాటు తాగితే వాత దోషాలు పోతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల వాపులు కూడా లేకుండా పోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మనం తినే ఆహారం త్వరగా అరుగుతుంది. రక్తహీనత సమస్య నుంచి కూడా విముక్తి కావచ్చు.

    ఈ చిట్కా పాటిస్తున్నప్పుడే కాల్షియం లోపం లేకుండా చేసే ఆహారాలు తీసుకోవడం మంచిది. విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే రోజు ఉదయం ఎండలో ఉండటం చాలా మంచిది. వ్యాయామాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు మాయమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మోకాళ్ల నొప్పులు తగ్గడం గ్యారంటీ.