Asim Munir lunch with Trump : ఆసిమ్ మనీర్.. పాక్ ఫీల్డ్ మార్షల్.. ఈయనన ప్రపంచం ఒప్పుకోదు. మూడు నాలుగురోజులుగా అమెరికాలో పడిగాపులు కాస్తూ రహస్యంగా ట్రంప్ తో లంచ్ మీట్ కు హాజరయ్యాడు. అది రహస్యంగా.. నో ప్రెస్ బ్రీఫింగ్. ప్రెస్ వాళ్లను అసలు అలో చేయలేదు. ఆ లంచ్ లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
అసలు సారాంశం ఏంటి.. ట్రంప్ తో భేటి పాకిస్తాన్ లో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని ఆసిమ్ మునీర్ భావిస్తున్నాడు. కానీ ఇది స్వయంకృతాపరాధం.. ఆసిమ్ మునీర్ ఆశించిన దానికన్నా నిరాశనే ఎక్కువ ఎదురవుతోందట..
మామూలు సందర్భాల్లో ఈ కలయిక బాగానే ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ లోని సామాన్యులు ఏమనుకుంటారు. ముస్లింలకు మద్దతుగా నిలవాలని ఇరాన్ కు అనుకూలంగా పాక్ జనం ఉన్నారు. ఇజ్రాయెల్ పై భగ్గుమంటున్నారు.
ఈ సందర్భంలో మునీర్ అమెరికా అధ్యక్షుడుని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉందని.. యుద్ధంలోకి దిగబోతోందని సమాచారం. ఇదే సమయంలో ఆసిమ్ మునీర్ తో ట్రంప్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ కు నోబెల్ బహుమతి కోసం నామినేట్ చేయడానికి మునీర్ వచ్చాడని మీడియాకు చెప్పారు. దీన్ని పాకిస్తాన్ ప్రజలు ఎలా చూడబోతున్నారన్నది ప్రశ్న.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పై అనుమానపు నీలినీడలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.