Pawan Kalyan : మార్చి 14.. దేశవ్యాప్తంగా హోలీ పండుగ రోజు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పండుగ జరిగింది. అదే ఉత్సాహం ఉరకలేసింది. చిత్రాడ సభ చరిత్రలో నిలిచిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకే సభా ప్రాంగణం నిండిపోయింది. అందరూ బయట వేచిఉన్నాడు.
ఎండ తీవ్రత ఉన్నా రాత్రి 10.30 వరకూ వేచిఉన్నారు. అధికారంలో లేనప్పుడు సభ జరిగినా ఇదే అభిమానం చూపించారు. ఎక్కడా సభలో అపశ్రుతి చోటుచేసుకోలేదు.
జనసేన అంటే బిర్యానీ కోసం, మందు కోసం వచ్చిన వారు కాదు.. స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లు వచ్చిన అభిమానులు.
ఇవాళ ఈ సభ ప్రాముఖ్యత ఏంటంటే.. అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొట్టమొదటి సభ. పార్టీ అనేక కొత్త ప్రాంతాలకు విస్తరించాక జరుగుతున్న మొదటి సభ.
జనసేనకు అంతకుముందు కార్యకర్తలు బలంగా ఉండేవారు. ఎన్నికలకు ముందు నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకొకరు లేరు. కానీ ఇవాళ సభకు జనసేనలో చేరిన బాలినేని, కొణతాల, ఉదయభాను లాంటి సీనియర్ లీడర్లు జనసేనలో చేరారు. 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సభలో పాల్గొన్నారు.
పార్టీ పెట్టిన తర్వాత అద్భుత ఫలితం వచ్చిన సందర్భం లేదు. అందుకే జయకేతనం అని సభకు పేరు పెట్టారు. కనీవినీ ఎరుగని జనంతో గేమ్ ఛేంజర్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ పిఠాపురం సభపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.