Rajeev Chandrashekhar : జైశంకర్ సాక్షిగా నేడు రాజీవ్ చంద్రశేఖర్ నామినేషను

రాజీవ్ పోటీతో కేరళలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్, ఏం చెప్తే ఆ మైండ్ సెట్ లోనే ప్రజలు ఉండేవారు. కేరళ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..

Written By: NARESH, Updated On : April 4, 2024 1:17 pm

Rajeev Chandrashekhar : కేరళలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. నిన్ననే రాహుల్ గాంధీ వాయినాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. శశిథరూర్ కూడా నిన్ననే నామినేషన్ వేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సమక్షంలో తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.

రాజీవ్ పోటీతో కేరళలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్, ఏం చెప్తే ఆ మైండ్ సెట్ లోనే ప్రజలు ఉండేవారు. అదే నిజమని నమ్మేవారు. రాజీవ్ చంద్రశేఖర్ జనాల్లో ఆలోచన కలిగిస్తున్నారు.

15 ఏళ్ల శశిథరూర్ పర్ ఫామెన్స్ ఎలా ఉందని రాజీవ్ అడుగుతున్నారు. ఈ ఎన్నిక కావాలంటే రిపోర్ట్ కార్డ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తిరువనంతపురం పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈనాటికి 3 లక్షల ఇళ్లకు ట్యాప్ వాటర్ కనెక్షన్ లేదని రాజీవ్ సంచలన నిజాలు బయటపెట్టారు. అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు.

కేరళ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..