Tillu Square Collections: డీజే టిల్లు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర టిల్లు భాయ్ దమ్ దమ్ జేస్తుండు. అంతేనా ఈయన రికార్డ్స్, కలెక్షన్లు చూస్తూ అబ్బో సినిమా అదిరిపోయింది లే అనాల్సిందే. సిద్దు జొన్నలగడ్డ కంటే డీజే టిల్లు అంటేనే ఈ హీరో గురించి ఎక్కువగా తెలుస్తోంది. ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యాడు టిల్లు భాయ్. సినిమాతో పనిలేకుండా కేవలం హీరో క్యారెక్టర్ తో మాత్రమే హిట్ అయ్యే సినిమాలు చాలా తక్కువ. స్టోరీ నచ్చకపోయినా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి.
డీజే టిల్లు కూడా సినిమా స్టోరీతో పనిలేకుండా హీరో క్యారెక్టర్ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇదే రేంజ్ లో టిల్లు స్క్వేర్ కూడా వచ్చింది.ఈ సినిమాతో సిద్దూ జొన్నల గడ్డ క్రియేట్ చేసిన టిల్లు క్యారెక్టర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. దీంతో స్టార్ హీరోల రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నాడు. మరి వీకెండ్ ముగిసేసరికి టిల్లు స్క్వేర్ సినిమా ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంది? కలెక్షన్లు ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే డీజే టిల్లు సినిమా వచ్చినప్పుడు టిల్లు అంటే ఎక్కువగా ఎవరికి తెలియదు.
సినిమా విడుదల అయిన తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇక టిల్లు స్వ్కేర్ తర్వాత మరింత మారింది ఆయన రేంజ్. తన మేనరిజంతో మెస్మరైజ్ చేశారు టిల్లు భాయ్. ఇక టిల్లు మొదటి సినిమానే బాక్సాఫీస్ ను షేక్ చేసిందంటే.. పార్ట్ 2 మరింత రచ్చ చేస్తోంది. మొదటి రోజే రూ. 24 కోట్లు వసూలు చేసిన టిల్లు స్క్వేర్ తర్వాత రెండు రోజులు కూడా అదే రేంజ్ ను కంటిన్యూ చేసింది. 3 రోజుల్లో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది ఈ టిల్లు స్క్వేర్ సినిమా.
సిద్దు దూకుడు చూస్తుంటే ఫస్ట్ వీక్ లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయేలా ఉంది. ఈ సినిమాకు చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఒకవేళ ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరితే మీడియం రేంజ్ హీరోలు అయినా నాని, తేజ సజ్జా, విజయ్ దేవరకొండ, రవితేజ, నిఖిల్ తర్వాత ఈ ఫీట్ సాధించిన హీరోగా నిలుస్తారు సిద్దూ. ఎలాగూ పరీక్షలు కూడా అయిపోయాయి. సో టిల్లు గాడీ జోరుకు బ్రేకులు పడేలా లేవు. మరి చూడాలి వీకెండ్ వరకు ఎన్ని కలెక్షన్లు సంపాదిస్తాడో..