Rahul Gandhi Court Cases: మళ్లీ రాహుల్ గాంధీ వార్తల్లోకి ఎక్కాడు. లక్నోలో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఆర్మీ మీద కామెంట్ చేశాడు. భారతీయ ఆర్మీని అవమానించేలా మాట్లాడాడు. ఇదే మొదటిది కాదు రాహుల్ కు.. చివరిది కాదు.. ఈయన నోరు పారేసుకుంటూనే ఉన్నారు.
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా రాహుల్ గాంధీలో ఎటువంటి మార్పు రాలేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యాక కొంత బాధ్యతగా ప్రకటనలు ఇస్తాడని అనుకున్నాం కానీ అదీ లేదు.
విదేశాలకు వెళ్లి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు. భారత వ్యతిరేకులతో సమావేశం అవుతాడు. ఇలా చెప్పాల్సి వస్తే చాలా మంది భారత్ కుట్రదారులతో భేటి అవుతాడు.అందుకే కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికీ రెండు సార్లు కోర్టుకు క్షమాపణ చెప్పాడు. 2019లో సుప్రీంకోర్టులో రఫేల్ విషయంలో మోడీకి సారీ చెప్పాడు. అంతకంటే ముందే ‘ఆర్ఎస్ఎస్’ మహాత్మగాంధీని హత్య చేసిందని మాట్లాడి బీవండిలో కోర్టుకెళ్లి క్షమాపణ చెప్పాడు.
చరిత్రను తెలుసుకోడు.. చదవడు.. పక్కనున్న మందీ మాగధులు చెబితే మైక్ ముందు మాట్లాడుతాడు. అందుకే కోర్టు కేసులు 10 ఉన్నాయి. బెయిల్ పై ఇలా విడుదలవుతూనే ఉన్నాడు.
రాహుల్ గాంధీ ఏది పడితే అది మాట్లాడి ఎలా చులకనవుతున్నాడు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
