Asia Best Bars: ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు, ఆహారానికి, ప్రశాంతతకు, నేరాలకు అనేక సంస్థలు ర్యాంకింగ్స్ ఇస్తుంటాయి. ఏ విషయంలో ఏ దేశంలో ఏ స్థానంలో ఉందో తెలియజేసి పోటీ పడేందుకు ఇలాంటి సర్వేలు దోహదపడతాయి. ఇక కాక్‌టెయిల్, బార్ల విషయంలోనూ ఓ సంస్థ సర్వే చేసింది. ఇందులో ఆసికయాలో మన దేశమే నంబర్ వన్‌గా నిలిచింది. 2025లో ఆసియాలో 50 బెస్ట్ బార్లలో భారత్ తన సొంత కాక్‌టెయిల్ బ్రాండ్‌తో ఆకట్టుకుంది. ఢిల్లీకి చెందిన లెయిర్ బార్ అత్యుత్తమ బార్‌గా నిలిచింది. మరో నాలుగు భారతీయ బార్‌లు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో స్థానం సంపాదించాయి.
లెయిర్ ఢిల్లీ…
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న లెయిర్ బార్, కాక్‌టెయిల్ ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జైరాజ్ సింగ్ సోలంకి, ధ్రువ్ రాజ్ విజ్ ద్వయం 2019లో స్థాపించిన ఈ బార్, మహమ్మారి సవాళ్లను అధిగమించి, 2025 నాటికి ఆసియా స్థాయిలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, గాజు సామాగ్రిపై తినదగిన పెయింట్, పికాంటే వంటి అసాధారణ కాక్‌టెయిల్స్, మోనోక్రోమ్ డిజైన్. లెయిర్ కేవలం పానీయాల స్థలం కాదు, అది కథనాలు, కళాత్మకతతో కూడిన అనుభవం.
Also Read: AP Alcohol Permit Rooms: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్!
సోకా, బెంగళూరు..
బెంగళూరులోని సోకా బార్, 38 సీట్ల చిన్న స్థలంలో గోవా కళాఖండాలు, లెదర్ సోఫాలతో ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తుంది. జామింగ్ గోట్ బృందం నేతృత్వంలో, చెఫ్ సోంబీర్ చౌధరి, బార్టెండర్ అవినాష్ కపోలి, స్థానిక కథలను కాక్‌టెయిల్స్ రూపంలో అందిస్తారు. రస్సెల్ మార్కెట్ నుంచి తెచ్చిన ఎర్ర క్యాబేజీ రసంతో గులాబీ రంగులో మెరిసే మోఫో డాన్ లాంటి పానీయాలు, లేదా క్లారిఫైడ్ జాస్మిన్, సౌస్–విడెడ్ బనానాతో తయారైన కాక్‌టెయిల్స్ సోకాను ఒక కథకుడిగా నిలబెడతాయి.
బాయిలర్‌మేకర్, గోవా..
గోవాలోని బాయిలర్‌మేకర్ బార్, క్రాఫ్ట్ బీర్, కాక్‌టెయిల్స్‌ను ఒకే చోట మేళవిస్తుంది. పంకజ్ బాలచంద్రన్, నకుల్ భోన్సే్ల స్థాపించిన ఈ బార్, ఇండస్ట్రియల్ డిజైన్‌తో ఆకర్షిస్తూ, స్మాషబుల్స్, సెషనబుల్స్, షార్టీస్ అనే మూడు రకాల మెనూతో రుచుల పండగను అందిస్తుంది. పప్పాయ, రమ్, సిచువాన్ పెప్పర్‌తో కూడిన పాపా ఇష్యూస్ లేదా కాంపరి, ఫ్రెష్ ఆరెంజ్‌తో తయారైన చోటు గరిబాల్డి వంటి పానీయాలు ఈ బార్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
జెడ్‌ఎల్‌బీ23, బెంగళూరు..
ది లీలా ప్యాలెస్‌లో ఉన్న జెడ్‌ఎల్‌బీ23, నిషేధ యుగంలోని న్యూయార్క్, క్యోటో శైలి సమ్మేళనంతో ఆకట్టుకుంటుంది. షిసో నెగ్రోనిస్, స్మోకీ ఓల్డ్–ఫ్యాషన్డ్‌లు, లైవ్ జాజ్ సంగీతం ఈ బార్‌ను ఒక రహస్య సౌందర్యంగా మార్చాయి. ఇక్కడ ప్రతీ సిప్ ఒక రహస్యాన్ని ఆవిష్కరించినట్లు అనిపిస్తుంది.
Also Read: Alert For Alcohol Drinkers : మద్యం తాగేవారికి అలర్ట్.. ఈ బ్రాండ్ టెస్ట్ చేశారా?
స్పిరిట్ ఫార్వర్డ్, బెంగళూరు..
లావెల్ రోడ్‌లోని స్పిరిట్ ఫార్వర్డ్, ఐస్ క్యూబ్‌లపై స్టాంప్‌లు, బ్లూ చీజ్‌తో నింపిన ఆలివ్‌లు, గిన్ మార్టినీలను సీసాలో చల్లగా అందించడం వంటి వినూత్న ఆలోచనలతో ఆకర్షిస్తుంది. సదరన్ స్టార్ అనే టకీలా ఆధారిత కాక్‌టెయిల్, గువావా, ప్లమ్, జలపీనోతో 36 గంటలు ఫెర్మెంట్ చేసి, సిల్కీ రుచిని అందిస్తుంది. ఈ బార్ బెంగళూరు బార్ సంస్కృతికి కొత్త ఒరవడిని జోడించింది.
జాబితాలో స్థానం దక్కని మరికొన్ని బార్లు..
50 బెస్ట్ బార్స్ జాబితాతోపాటు, 51–100 జాబితాలో గోవాకు చెందిన బార్ ఔట్‌రిగ్గర్ (55), ఢిల్లీలోని సైడ్‌కార్ (62), ముంబైలోని బాంబే క్యాంటీన్ (69), గోవాలోని హైడ్‌అవే (94) స్థానం సంపాదించాయి. ఈ బార్‌లు కూడా భారతీయ కాక్‌టెయిల్ సంస్కృతికి గణనీయమైన కృషి చేస్తున్నాయి.