Rashmika vs Samantha: పాన్ ఇండియా హిట్స్ తో దేశాన్ని తనవైపు చూసేలా చేసిన రష్మిక మందానకు సమంత షాక్ ఇచ్చింది. కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేనప్పటికీ ఇమేజ్ లో సమంతనే టాప్ అని తేలింది. సమంత ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అని లేటెస్ట్ సర్వేలో తేలింది.
Also Read: కియారా అద్వానీ సోదరి ఇంత అందంగా ఉందేంటి..అక్కని మించిపోయిందిగా!
రష్మిక మందాన(RASHMIKA MANDANNA) ఇండస్ట్రీకి వచ్చే నాటికే సమంత(SAMANTHA) స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది. 2010లో ఏమాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. వరుస విజయాలతో అనతికాలంలో స్టార్ హీరోయిన్ అయ్యింది సమంత. కెరీర్ బిగినింగ్ లోనే ఎన్టీఆర్, మహేష్ వంటి టాప్ స్టార్స్ పక్కన ఆఫర్స్ పట్టేసింది. కెరీర్ పరుగులు పెడుతున్న తరుణంలో అనసూయను వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయి. భర్త నాగ చైతన్యతో విబేధాలు తలెత్తి, విడాకులు తీసుకుంది. ఆ డిప్రెషన్ నుండి బయటపడేందుకు కొంత సమయం పట్టింది.
ఆ వెంటనే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మయోసైటిస్ బారినపడింది అనసూయ. ఈ కారణంగా ఓ ఏడాది పాటు అనసూయ సినిమాలకు దూరంగా ఉంది. 2020 తర్వాత సమంత కెరీర్ నెమ్మదించింది అని చెప్పొచ్చు. గత రెండేళ్లో సమంత నుండి ఒక్క సినిమా రాలేదు. హనీ బన్నీ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ మాత్రం చేసింది. నిర్మాతగా మారిన సమంత… శుభం టైటిల్ తో ఒక చిత్రం నిర్మించింది. ఈ సినిమాలో ఆమె గెస్ట్ రోల్ చేసింది. ఇక స్టార్స్ తో సమంత జతకట్టి చాలా కాలం అవుతుంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ చేసింది.
మరోవైపు రష్మిక భారీ విజయాలతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకుంది. ఈ మధ్య కాలంలో రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, చావా వందల కోట్ల వసూళ్లు సాధించాయి. మూడు వేల కోట్ల హీరోయిన్ అని రష్మికను కొనియాడిన నాగార్జున, ఆ రికార్డు స్టార్ హీరోలకు కూడా లేదని అన్నారు. ఇక స్క్రిప్ట్ సెలక్షన్ లో రష్మిక తర్వాతే ఎవరైనా అంటూ ఆమెను ఎత్తేస్తున్నారు. రష్మిక లేటెస్ట్ రిలీజ్ కుబేర సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇమేజ్ లో ఆమె సమంత తర్వాతే అట. ప్రముఖ బాలీవుడ్ మీడియా సర్వేలో ఇది తేలింది.
2025 జూన్ నెలకు గాను మోస్ట్ ఫీమేల్ ఫిల్మ్ స్టార్స్ ఇండియా పేరిట జరిపిన సర్వేలో రష్మికకు భారీ షాక్ తగిలింది. ఆమెకు టాప్ 5లో కూడా చోటు దక్కలేదు. కనీస విజయాలు లేని హీరోయిన్స్ రష్మిక కంటే మెరుగైన ర్యాంక్స్ సాధించారు. ఆర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం సమంత ఇండియాలోనే నెంబర్ హీరోయిన్ అట. రెండో స్థానంలో అలియా భట్, మూడో స్థానంలో దీపికా పదుకొనె, నాలుగో స్థానంలో త్రిష, ఐదో స్థానంలో కాజల్ ఉన్నారు. ఇక ఆరో స్థానంలో సాయి పల్లవి, ఏడో స్థానంలో నయనతార ఉన్నారు.
Also Read: నా భర్త ఆ విషయంలో ఎన్నో ఏళ్ళ నుండి టార్చర్ చేస్తున్నాడు : జెనీలియా
రష్మికకు ఎనిమిదవ స్థానం దక్కింది. కీర్తి సురేష్ కి తొమ్మిదవ స్థానం, తమన్నాకు పదవ స్థానం దక్కింది. పెళ్లి చేసుకుని ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న కాజల్, సీనియర్ హీరోయిన్స్ త్రిష, నయనతార కూడా రష్మిక కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నారు. ఈ సర్వే ఫలితాలు చూస్తుంటే… భారీ హిట్స్ పడినప్పటికీ రష్మికకు జనాల్లో ఏమంత పాపులారిటీ లేదనిపిస్తుంది. ఇక ఈ సర్వే ఫలితాలు ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. అలాగే ఓ హిందీ చిత్రంలో నటిస్తుంది.