Pakistan in crisis: మూడు రోజుల క్రితం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో లాహోర్ చుట్టుపక్కల.. ముర్కిదేలో జరిగిన హింసాత్మక ఘటన ఓ అంత:ర్యద్ధాన్ని తలపిస్తోంది. ఆర్మీ వెహికల్ జనాన్ని తొక్కుకుంటూ వెళ్లింది. నిరాయుధలైన ప్రజలను పిట్టలను కాల్చినట్టు కాల్చారు.
తెహ్రీకీ లబ్బాయిక్ పాకిస్తాన్ సాద్ హుస్సేన్ వీడియో వచ్చింది. మేం నిరాయుధలం.. తోటి ముస్లింల.. మా మీద ఎందుకు కాల్చుతున్నారని ఆయన ప్రశ్నించాడు. ఆయన, ఆయన సోదరుడు కాల్పుల్లో చనిపోయారా? అరెస్ట్ అయ్యారా? అన్నది తెలియడం లేదు.
పాకిస్తాన్ లో మీడియాను తొక్కేశారు. ప్రభుత్వమే దాన్ని మేనేజ్ చేస్తుంది. అన్ని వార్తలను బ్యాన్ చేస్తారు. ఇంటర్నెట్ బంద్ చేసి వేల మందిని అరెస్ట్ చేశార. 2వేలకు పైగా మందిని హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం.
అసలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే.. చనిపోయింది చాలా మంది అని తెలుస్తోంది. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం ముదిరిందని వార్తలు వస్తున్నాయి.
పంజాబ్ అల్లర్లు, ఆఫ్ఘన్ సరిహద్దులు, సంక్షోభంలో పాకిస్తాన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.