YCP Rachabanda: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. కానీ ఏదో చేసాం అంతే. అన్నట్టు ముగిస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన డైలామా కనిపిస్తోంది. ఏదో సాక్షి మీడియా కవర్ చేసేలా కార్యక్రమాలు చేసి ముగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జగన్ విదేశాలకు వెళుతూ వెళుతూ 40 రోజులపాటు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఆందోళన కార్యక్రమాలు కనిపించడం లేదు. సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. కనీసం ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేసేవారు సైతం పెద్దగా కనిపించడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఎక్కడ నేతలు సౌండ్ చేయడం లేదు.
కనిపించని మార్పు
అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) అందుబాటులో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనల్లో పాల్గొనడం చాలా తక్కువ. అందుకే ఆయన విదేశాలకు వెళ్లిన పెద్దగా మార్పు రాలేదు. నేను లేకపోయినా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కానీ జిల్లాకు ఏదో ఒక తంతుగా ముగిస్తున్నారు. పూర్తిగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. చాలామంది నేతలు కార్యక్రమాలకు ముఖం చాటేశారు. ఇప్పటినుంచి జన సమీకరణ చేయలేమని.. డబ్బులు కూడా ఖర్చు చేయలేమన్న వారు ఉన్నారు. కేవలం జిల్లా కేంద్రాలకి ఆందోళన కార్యక్రమాలు పరిమితం అవుతున్నాయి కూడా. అధినేత లేకుండా నిరసన కార్యక్రమాలు ఏంటి అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.
నేతల సైలెంట్ మోడ్..
శ్రీకాకుళం( Srikakulam) నుంచి అనంతపురం వరకు తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. జగన్ రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిస్తే చాలా తేలిగ్గా తీసుకున్న వారు ఉన్నారు. కనీసం అటువంటి కార్యక్రమానికి పార్టీ హై కమాండ్ పిలుపు ఇచ్చింది అన్న విషయం కిందిస్థాయి క్యాడర్ కు తెలియడం లేదు. నియోజకవర్గ ఇన్చార్జిలు తెలియనివ్వడం లేదు. దీంతో పార్టీలో ఒక రకమైన అసంతృప్తి, నైరాస్యం కనిపిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అంతా రైట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం అంత సంతృప్తిగా లేవు.