150 years of Vande Mataram : వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు అయిన సందర్భంగా పార్లమెంట్ లో అద్భుత చర్చ జరిగింది. ఆ అంశంపై ప్రారంభోత్సవాన్ని చేసిందే మోడీ. దాదాపు గంట సేపు వందేమాతరం ఏ విధంగా దేశాన్ని ఉర్రూతలూగించింది.. విప్లవకారులను ఎలా ఊపిరిలూదింది.. ఎలా స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిందో మోడీ అద్భుతంగా వివరించారు. బెంగాల్ లో రగిలించి.. 1905లో స్వదేశీ ఉద్యమంగా ఎలా మారిందో మోడీ వివరించారు. ఠాగూర్, గాంధీజీ, నేతాజీ అందరూ వందేమాతరం గీతం గురించి ఎలా పొగిడారో వివరించారు.
1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ కాంగ్రెస్ కోల్ కతా సెషన్ లో ఎలా ఆలపించాడో చెప్పాడు. ఆ కాంగ్రెస్ సెషన్ కి అధ్యక్షత వహించింది ‘రహీమ్ తుల్లా సయాన్’ అనే ఒకముస్లిం కావడం గమనార్హం. నాడు దేశం కోసం హిందూ, ముస్లిం, సిక్కు, సహా అన్ని మతాల వారు వందేమాతరం కోసం నినదించి దేశభక్తిని చాటారు.
ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా మాత్రం దీన్ని నాడు వ్యతిరేకించారు. కాంగ్రెస్ లోని ముస్లిం నాయకులు ఆమోదించిన ఈ గీతాన్ని ముస్లిం లీగ్ మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఈ ముస్లిం లీగ్ ను శాంతపరచడానికి ‘వందేమాతరం’కు ప్రాధాన్యత తగ్గించారు. అదే పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైంది. విభజనకు బీజాలు పడేలా చేసింది.
వందేమాతరం పై పార్లమెంటులో చర్చించటాన్ని తప్పు పట్టిన ప్రియాంక గాంధీ
