Prabhas Is Safe: రీసెంట్ గా జపాన్ లో చోటు చేసుకున్న భారీ భూకంపం కారణంగా, ఎంతటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందో మనం కళ్లారా చూసాము. పెద్ద పెద్ద భవనాలు పేకమేడలు లాగా కూలిపోవడం, కళ్ళ ముందే వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం వంటి విచారకరమైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గానే రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘బాహుబలి : ది ఎపిక్’ మూవీ రిలీజ్ సందర్భంగా, ప్రొమోషన్స్ కోసం జపాన్ కి బయలుదేరాడు. అక్కడ ఆయన అభిమానులతో సరదాగా ముచ్చటించడం, థియేటర్ లోపలకు వెళ్లి అభిమానులకు అభివాదం చేయడం వంటివి మనం చూసాము. అయితే ఈ భూకంపం వార్త విన్న తర్వాత, ప్రభాస్ కూడా ప్రమాదం లో ఉన్నాడేమో, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, ఏంటో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
దీంతో రాజా సాబ్ డైరెక్టర్ మారుతీ ప్రభాస్ కి ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను ఈరోజు ఉదయమే ప్రభాస్ సార్ తో ఫోన్ లో మాట్లాడాను. ఆయన క్షేమంగానే ఉన్నారు. అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి తీసుకున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ జపాన్ లోనే ఉన్నాడు. నవంబర్ 27 నుండి సందీప్ వంగ స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటూ వచ్చిన ప్రభాస్, మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యేలోపు ‘బాహుబలి : ది ఎపిక్’ ప్రొమోషన్స్ కోసం జపాన్ కి బయలుదేరాడు. బాహుబలి 1 , బాహుబలి 2 చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ లాగా మార్చి రీసెంట్ గానే ఇండియా లో విడుదల చేసిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ లో అయితే ఇప్పటికీ ఈ చిత్రం విజయవంతంగా గత 40 రోజుల నుండి ఆడుతూనే ఉంది.
ఈ సినిమా ప్రొమోషన్స్ ని డైరెక్టర్ రాజమౌళి ఏ రేంజ్ లో చేసాడో మనమంతా చూసాము. అప్పుడు ప్రభాస్ ప్రొమోషన్స్ కి దూరం ఉన్నాడు. కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాడు. కానీ ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా, అక్కడ ప్రొమోషన్స్ బాధ్యతను మొత్తం ఆయనే తీసుకున్నాడు. ఇండియా లో రీ రిలీజ్ లో కూడా ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం, జపాన్ లో కూడా ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.