https://oktelugu.com/

West Bengal : బీసీ రిజర్వేషన్లని రాజకీయ దుర్వినియోగం చేసిన మమతా, బుద్దదేవ్ బట్టా చార్యలు

బీసీ రిజర్వేషన్లని రాజకీయ దుర్వినియోగం చేసిన మమతా, బుద్దదేవ్ బట్టా చార్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2024 / 12:53 PM IST

    West Bengal : నిన్నటి కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఎప్పుడూ ఇలాంటి తీర్పును మనం ఊహించలేదు. కానీ వాస్తవానికి లోతుగా విశ్లేషించి ఇచ్చిన తీర్పు ఇదీ..

    1993లో ఓబీసీ చట్టం చేశారు. 2009 తర్వాత 66 కులాలను ఓబీసీలో చేర్చారు. 54 హిందూ, 12 ముస్లిం వర్గాలున్నాయి. ఓబీసీలకు 7 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. 2010 ఫిబ్రవరిలో బుద్దదేవ్ భట్టాచార్య ఒక సంచలన ప్రకటన చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు.

    ఈ ప్రకటన తర్వాత అనేక మెమోలతో 42 కొత్త కులాలను ఓబీసీల్లో చేర్చారు. ఇందులో 41 ముస్లింలకు సంబంధించినవే కావడం గమనార్హం. రిజర్వేషన్లు 7 శాతం నుంచి 17 శాతానికి పెంచారు. ఈ 10 శాతం ఏ కేటగిరీలో పెట్టారు. ఓడిపోతామన్న భయంతోనే భట్టాచార్య ఇలా చేశారు.

    బీసీ రిజర్వేషన్లని రాజకీయ దుర్వినియోగం చేసిన మమతా, బుద్దదేవ్ బట్టా చార్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.