Edu Fund: ఒక్కో బిడ్డకు రూ.75 లక్షల ఖర్చు.. భారతీయ కుటుంబాల లెక్కలివీ..

భారతీయులు పిల్లలపై చేసే ఖర్చులు కాన్పు నుంచే మొదలవుతున్నాయి. డైపర్లు, వ్యాక్సిన్లు, వైద్య ఖర్చులు, బట్టలు, పుస్తకాలు, స్కూల్, కాలేజీ ఫీజులు, ఇంట్లో భోజనం, వినోదం, వాహనాల కొనుగోలు ఇతరత్రా ఖర్చులు.. బిడ్డ సంపాదదించే వరకు అనేకరకాలుగా ఖర్చు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 23, 2024 12:55 pm

Edu Fund

Follow us on

Edu Fund: ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్‌. ప్రస్తుతం దేశ జనాభా 143 కోట్లు. ఇదే సమయంలో యువత ఎక్కువగా ఉన్న దేశం కూడా మనదే. అందుకే యువ భారతం అని పిలుస్తారు. అయితే కొన్నేళ్లుగా భారత జనాభా క్షిణిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే శ్రామిక శక్తి తగ్గిపోతుంది. యువ భారతం కాస్త వృద్ధ భారతంగా మారుతుంది. ఫలితంగా ఉత్పాదకత తగ్గి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జనాభా పెరుగుదల రేటులో క్షీణతకు కారణాలు అన్వేశిస్తున్నారు నిపుణులు.

కారణాలు అనేకం..
భారత దేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణతకు నిపుణులు అనేక కారణాలు చూపుతున్నారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, మానసిక ఒత్తిడి, రేడియేషన్‌ ప్రభావం, సంపాదనపై దృష్టి పెట్టడం, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడంతో సామర్థ్యం తగ్గడం తదితర కారణాలు జనాభా పెరుగుదల రేటుపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. వీటితోపాటు ఇంకా అనేక కారణాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. పెళ్లయిన కొత్త జంటలు మునుపటిలా సంతానంపై ఆసక్తి చూపడం లేదని కూడా గుర్తించారు. సంతానాన్ని దంపతులు వాయిదా వేసుకుని సంపాదనపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం పెరుగుతున్న ఖర్చులే. నగరాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేసినా మిగిలేది అంతంత మాత్రమే. ఇది వైద్య ఖర్చులకు కూడా చాలడం లేదు. దీంతో కొత్త జంటలు సంపాదన ఫస్ట్‌.. సంతానం నెక్ట్‌ అని వాయిదాలు వేస్తున్నారని ‘మింట్‌’ ఓ నివేదికలో వెల్లడించింది.

కాన్పు నుంచే ఖర్చులు మొదలు..
ఇక భారతీయులు పిల్లలపై చేసే ఖర్చులు కాన్పు నుంచే మొదలవుతున్నాయి. డైపర్లు, వ్యాక్సిన్లు, వైద్య ఖర్చులు, బట్టలు, పుస్తకాలు, స్కూల్, కాలేజీ ఫీజులు, ఇంట్లో భోజనం, వినోదం, వాహనాల కొనుగోలు ఇతరత్రా ఖర్చులు.. బిడ్డ సంపాదదించే వరకు అనేకరకాలుగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో భారతీయుడు తన ఒక్కో సంతానంపై కనీసం రూ.65 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాట్టు ఎడ్‌–ఫిన్ టెక్‌ కంపెనీ ‘ఎడ్యూ ఫండ్‌’ తన నివేదికలో వెల్లడించింది. సగటున ఈ ఖర్చును రూ. 75 లక్షలుగా అంచనా వేసింది. ఇక డాక్టర్, లేదా ఇతర ఉన్నత చదువులు చదివితే ఈ ఖర్చు రూ.95 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు చేరుతుందని తెలిపింది.