KN Rajanna resigns: కాంగ్రెస్.. దాని చరిత్ర మొత్తం కూడా నిరంకుశత్వం.. కుటుంబ పాలనతోనే సాగింది. కర్ణాటకలో 74 ఏళ్ల సీనియర్ మంత్రి రాజన్న.. వాల్మీకీ కులానికి చెందిన వ్యక్తి. మధుగిరి అసెంబ్లీ ఎమ్మెల్యే. మధుగురి అసెంబ్లీ జనరల్ కేటగిరీ.. ఎస్టీ అయ్యిండి జనరల్ కేటగిరీలో గెలిచిన వ్యక్తి మంత్రి అయ్యారు.
మనసులో మాట దాచుకోని ఈ రాజన్న చేసిన వ్యాఖ్యలకు ఆయన మంత్రి పదవి పోయింది. హెచ్.డీ దేవగౌడపై, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు..
రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్ లోని మహదేవపూరలో లక్ష ఓట్లు ఫేక్ అని చెబుతున్నాడు కదా.. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తోంది. మన అధికారులే చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే కన్ఫమ్ చేసింది కదా.. అంటూ సొంత పార్టీ మంత్రి రాహుల్ తీరును తప్పుపట్టడంతో డీకే శివకుమార్ ఆగ్రహించారు. సిద్ధరామయ్య శిష్యుడు అయిన రాజయ్యను ఒక్కరోజులోనే మంత్రి పదవి నుంచి తొలగించాడు.
సిద్దరామయ్యను ఇరకాటంలో పెట్టిన మంత్రి రాజన్న తొలగింపు .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.