Nandamuri Balakrishna daughter movie: సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…రాజకుమారుడు సినిమా హిట్ అయినప్పటికి ఆ తరువాత చేసిన సినిమాలతో వరుస ప్లాప్ లను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధించాడు. ఇకమీదట కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక మహేష్ బాబు హీరోగా బాలయ్య బాబు కూతురు అయిన బ్రాహ్మణి ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇంకా బ్రాహ్మణి హీరోయిన్ గా చేస్తుంది అని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికి చివరి నిమిషంలో ఆమెను హీరోయిన్ గా చేయడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేక పక్కన పెట్టేశారు. మొత్తానికైతే తనకున్న అందచందాలతో హీరోయిన్ గా మారితే మాత్రం టాప్ లెవల్లో ముందుకు తీసుకెళ్లేది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు నటవారసత్వాన్ని నిలబెట్టే హీరోయిన్ గా తను ఒక వెలుగు వెలిగేది అంటూ మరి కొంతమంది కామెంట్స్ స్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వచ్చిన కూడా అవి కార్య రూపం దాల్చడం లేదు. అందువల్ల బాలయ్య నట వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి…
ఇక మహేష్ బాబు లాంటి నటుడు ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే సినిమానైతే చేస్తున్నాడు. ‘వారణాసి’ సినిమా అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్తుందనే ఒక దృఢ సంకల్పంతో అతను ముందుకు సాగుతున్నాడు. అభిమానులు సైతం ఈ మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.
1300 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడమే కాకుండా 3000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాలనే టార్గెట్ ను పెట్టుకొని ముందుకు సాగుతుంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…