Rahul Gandhi exposed conspiracy : రాహుల్ గాంధీ షూట్ అండ్ స్కూప్.. ప్రశ్న వదలడం.. మనం చర్చల మీద చర్చలు పెట్టడం.. ఇది కొన్నేళ్లుగా నడుస్తోంది. ప్రశ్నించే వ్యక్తికి బాధ్యత కూడా ఉండాలి. రాజ్యాంగబద్ద సంస్థలతో కూడా అలా మాట్లాడితే ఎలా? ఎలక్షన్ కమిషన్ మీద డౌట్స్ ఉంటే డైరెక్టుగా మాట్లాడాలని ఈసీ సూచించినా రేవంత్ పెడచెవిన పెట్టాడు. ఒక రాయి వేసేస్తుంటాడు. తర్వాత మనం కొట్టుకోవాలి. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఇంత బాధ్యత లేని నేతను ఇప్పటివరకూ చూడలేదు.
రాహుల్ గాంధీకి చదువుకునే ఓపిక లేదు. బాంబే హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ది రాలేదు. కొత్త ఓటర్లలో అవకతవకలు వచ్చాయని రాహుల్ ఆరోపించారు. ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వచ్చారు. వారిని ఓటు వేయకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. దీనిపై రాహుల్ కు ఉలికిపాటు ఎందుకు? ఇల్లీగల్ గా వచ్చిన ఓటు బ్యాంకుగా చేసుకున్న వారికే ఈ ఉలికిపాటు.
బెంగాల్ లో ఇల్లీగల్ వ్యక్తుల లక్షలమంది ఉన్నారు. దీన్ని కేంద్రం ఎలా గుర్తించాలి.. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని ఉద్యోగులే ఇలా సర్వే చేయాలి. కానీ అది ఎఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేరన్నది కాదనలేని సత్యం.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన వాళ్ళే రాజ్యాంగ పరిరక్షకులుగా దొంగ అవతారాలెత్తితే ఎలా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
