Homeఎంటర్టైన్మెంట్OG 2: 'ఓజీ 2' లో 8 తలలు , 8 తోకల 'డ్రాగన్'.. కాన్సెప్ట్...

OG 2: ‘ఓజీ 2’ లో 8 తలలు , 8 తోకల ‘డ్రాగన్’.. కాన్సెప్ట్ వింటే మెంటలెక్కిపోవాల్సిందే..వీడియో వైరల్..

OG 2: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ గురించి తప్ప మరో చర్చ జరగడం లేదు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది , ప్రస్తుతం స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ని రీసెంట్ గానే పవన్ కళ్యాణ్, సుజిత్ కలిసి మాట్లాడుకుంటున్న ఒక వీడియో ని విడుదల చేసారంతే, సోషల్ మీడియా దెబ్బకు భగ్గుమంది. ఇందులో సుజిత్ చెప్పిన రెండు సన్నివేశాలను ఆధారంగా తీసుకొని , సోషల్ మీడియా లో నెటిజెన్స్ క్రియేట్ చేసిన AI వీడియోలను చూస్తుంటే, సుజిత్ అభిమానుల అంచనాలను అందుకుంటాడా?, లేదా?, సోషల్ మీడియా AI ద్వారా చూపించిన విజువల్స్ సినిమాలో లేకపోతే అభిమానులు చాలా ఫీల్ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి పెట్ గా ‘డ్రాగన్’ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ ఒక చిన్న హింట్ ఇచ్చాడు.

ఆ డ్రాగన్ ని పవన్ కళ్యాణ్ కి పెట్ గా చూపిస్తూ , సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ క్రియేటివిటీ ని చూపిస్తూ కిరియేట్ చేసిన AI వీడియోలను డైరెక్టర్ సుజిత్ చూస్తే ‘ఎవర్రా మీరంతా’ అనే మీమ్ ని ఉపయోగిస్తారు, ఆ రేంజ్ లో ఉన్నాయ్ అన్నమాట. ఇకపోతే ప్రకటన వీడియో కి సంబంధించి చిన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను తెగ ఆకర్షించింది. ఈ మ్యూజిక్ కి సంబంధించిన పూర్తి వెర్షన్ ని నిన్న లిరిక్స్ తో సహా విడుదల చేశారు ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్. ఈ మ్యూజిక్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది అసలు మన ఇండియన్ సినిమాకు సంబంధించిన ట్రాక్ లాగా లేదని , హాలీవుడ్ రేంజ్ లో ఉందని, తమన్ ఓజీ ని మించిన మ్యూజిక్ ఈ చిత్రానికి అందించబోతున్నారని ఈ ఒక్క మ్యూజిక్ వీడియో ని చూసి చెప్పొచ్చు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు.

ఇకపోతే ఈ పాటలోని ముఖ్యమైన లిరిక్స్ లో ఒకటి ‘యమటానో ఓరొచ్చి’. దీని అర్థం ఏమిటి అని అభిమానులు గూగుల్ లో వెతకగా , అదొక 8 తలలు, 8 తోకలు ఉన్నతువని డ్రాగన్ అని తెలిసింది. ఒక్కసారి ఊహించుకోండి , 8 తలల డ్రాగన్ , నిప్పుల సునామీ ని కురిపిస్తూ వెండితెర పై కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది , ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. చూస్తుంటే ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ , సుజిత్ పాన్ ఇండియన్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారని అనిపిస్తోంది , నవంబర్ లో షూటింగ్ మొదలెట్టి , ఏప్రిల్ లోపు పూర్తి చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు సుజిత్. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version