Madhuri Divvala: దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాధురి( Divvela Madhuri) జంట మరోసారి చిక్కుల్లో చిక్కుకుంది. పుణ్యక్షేత్రం తిరుమల లో చెయ్యకూడని పనులు చేసి వివాదంలో చిక్కుకున్నారు. కొండపై రీల్స్ చేసి వివాదానికి కారణమయ్యారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా తీసుకుంది. వారికి నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల కిందట ఈ జంట తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. దర్శనం తర్వాత వారు బస్సెస్ చేసిన విభవ అతిథి గృహం వద్ద దివ్వల మాధురి రీల్స్ చేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. టిటిడి దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ విభాగం దివ్వెల మాధురికి నోటీసులు పంపింది.
* గతంలో కూడా ఇలానే..
తిరుమలలో దివ్వెల మాధురి వివాదం కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె ఎటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు. 2024 అక్టోబర్లో తిరుమడ వీధుల్లో ఆమె రీల్స్ చేశారు. దీనిపై టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. అయితే అప్పట్లో అది రాజకీయ ప్రేరేపిత కేసు అని మాధురి అడ్డంగా వాదించారు. చివరకు టీటీడీ అధికారులకు క్షమాపణలు కోరారు. అప్పట్లో ఆ వివాదం అలా సద్దుమణిగింది. కానీ ఇప్పుడు ఏకంగా అతిథి గృహం వద్ద ఆమె రూల్స్ చేయడం.. భక్తులు చూసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీటీడీ మరోసారి రంగంలోకి దిగింది. విజిలెన్స్ విభాగం నోటీసులు ఇచ్చింది. దీనిపై మాధురి ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
* వ్యాపార రంగంలో జంట
దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట టెక్సటైల్స్( textiles) రంగంలో అడుగుపెట్టింది. హైదరాబాదులో వకుల సిల్క్స్ పేరిట భారీ వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు. అయితే దానికి సొంతంగానే ప్రచారం చేసుకుంటున్నారు దివ్వెల మాధురి. తరచూ రీల్స్ చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో కలిసి చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. మరోవైపు ఇటీవల ఈ జంట ఓ ఫంక్షన్ లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పాత పాటలకు డాన్స్ వేస్తూ ఆకట్టుకుంది ఈ జంట. అయితే ఎక్కడకు వెళ్లిన రీల్స్ చేసే అలవాటు దివ్వెల మాధురికి ఉంది . అదే అలవాటుతో తిరుమల కొండపై రీల్స్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడింది మాధురి.