Google investment in Vizag: రాజకీయాల్లో అదృష్టం కలిసిరావాలి. ఎంత కష్టపడినా ఫలితాలు రావు. ఆంధ్రాకు ఇప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి మెగా సిటీ లేని ఓ అనాథ రాష్ట్రంగా ఏర్పడిన ఏపీకి 2014లో కేంద్రం సరిగ్గా చేయూత ఇవ్వలేదన్న అపవాదు ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ లకు ప్రాధాన్యతనివ్వకుండా కేవలం సంక్షేమ పథకాలపైనే ఖర్చు చేశాడు.
2014 నుంచి 2024 వరకూ ఏపీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 2024లో ఎన్డీఏ గూటికి పవన్ కళ్యాణ్ చొరవతో కూటమిలో చేరడం.. దేశంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడడంతో మరింత అదృష్టం ఏపీకి వచ్చింది.
ఇప్పుడు పదేళ్ల నష్టాన్ని పూడ్చుకునేలా ఏపీకి కేంద్రం నుంచి నిధులు వెల్లువలా వస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న పనులు, స్కేలు ఈసారి బాగా కుదిరి ‘బ్రాండ్ చంద్రబాబు’ కలిసి వచ్చి నిధుల వరద పారుతున్నాయి.
పోలవరానికి ఆర్థిక సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ, అమరావతి రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్, చాలా పనులు ఏపీకి కేంద్రం సాయం చేస్తోంది.
గూగుల్ పెట్టుబడి 10 కాదు 15 బిలియన్ డాలర్లు.. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.