Khawaja Asif Key comments: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దశాబ్దాలుగా పోరాడుతోంది. కలిసి వచ్చే దేశాలను కలుపుకుపోతోంది. ఉగ్రవాదం విస్తరించడంతో ఇప్పుడు ప్రపచంలో చాలా దేశాలు సమస్య ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ఇటీవల జరిగిన మహల్గాం ఉగ్రదాడి సమయంలో చాలా దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. అయితే పామును పాలు పోసి పెంచినా అది కాటేయక మానదు ఇప్పుడు పాకిస్తాన్ అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆఫ్గానిస్తాన్‌లో తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తా(టీటీపీ)ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు దానితోనే ముప్పు ఎదర్కొంటోంది. ఇటీవలే టీటీపీ లక్ష్యంగా పాకిస్తాన్ కాబూల్‌పై వైమానిక దాడులు జరిపింది. టీటీపీ అధ్యక్షుడిని టార్గెట్ చేసింది. అయితే ఈ దాడులను ముస్లిం దేశాలు ఖండించాయి. కానీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ దాడులను సమర్థించుకున్నారు. ఈమేరకు ఇటీవలి వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) లక్ష్యాలపై తమ దేశం చేసిన వైమానిక దాడులను సమర్థిస్తూ, ఉగ్రవాద సంస్థలపై దాడి చేసే హక్కు ప్రతి దేశానికి ఉందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్‌కు అనుకోకుండా మద్దతు
ఖ్వాజా ఆసిఫ్ తమ దేశం వైమానిక దాడులను సమర్థిస్తూ, ‘దాడి చేయబడితే తక్షణమే ప్రతిదాడి చేసే హక్కు ఉంది. దాడి ఎక్కడ నుండి వస్తుందో అక్కడ లక్ష్యం చేసే హక్కు ఉంది‘ అని తెలిపారు. ఈ వ్యాఖ్య భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌కు పరోక్షంగా మద్దతునిచ్చినట్లయింది. 2025 మే 22న పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతిగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. జైష్–ఇ–మహమ్మద్ , లష్కర్–ఇ–తోయిబా వంటి పాకిస్తాన్–ఆధారిత ఉగ్రవాద సంస్థల స్థావరాలపై కచ్చితమైన క్షిపణి దాడులు చేసింది.
పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ వివాదం
ఇదిలా ఉంటే అక్టోబర్ 11–12 తేదీల్లో పాకిస్తాన్–ఆఫ్గానిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఘర్షణలు జరిగాయి. పాకిస్తాన్ ప్రకారం 23 మంది సైనికులు మరణించారు, అయితే తాలిబాన్ 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని పేర్కొంది. పాకిస్తాన్ దాదాపు 200 మంది తాలిబాన్ యోధులను చంపినట్లు తెలిపింది.
వీసా తిరస్కరణ
ఈ ఘర్షణల నేపథ్యంలో ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఐఎస్‌ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్, ఇద్దరు జనరల్స్ వీసా అభ్యర్థనలను మూడు రోజుల్లో మూడుసార్లు తిరస్కరించింది. ఖ్వాజా ఆసిఫ్ ‘బెదిరింపుల మధ్య చర్చలు అంగీకరించడం కాదు‘ అని స్పష్టం చేశారు. ఆఫ్గానిస్తాన్‌లో ఐసిస్, అల్–ఖైదా, తాలిబాన్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల సమాహారం ఉందని ఆరోపించారు.
అంతర్జాతీయ మధ్యవర్తిత్వం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చారు. చైనా కూడా రెండు దేశాలకు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ కూడా ఘర్షణ వాతావరణం నివారించేందుకు రంగంలోకి దిగాయి.
పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు దేశ విధానంలో అస్థిరత్వాన్ని చాటుతున్నాయి. ఒకవైపు భారత్‌తో యుద్ధం గురించి బెదిరింపులు చేస్తూనే.. మరోవైపు ఆపరేషన్ సింధూర్‌కు సమర్థనగా అర్థమయ్యే వ్యాఖ్యలు చేయడం వైరుధ్యాన్ని చూపిస్తుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారత్ ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా ఉన్నాయి.