G-RAM G Bill: నిన్న పార్లమెంట్ లో ఉపాధి హామీ పేరును మార్చినందుకు ప్రతిపక్షాలు పెద్ద గందరగోళం సృష్టించారు. నిజానికి వీళ్లకు గాంధీపై మొదటి నుంచి ప్రేమ లేదు. డీఎంకే పార్లమెంట్ లో గొడవ చేస్తోంది. ఏ రోజు తమిళనాట గాంధీ పేరు మీద పథకం పెట్టలేదు. డీఎంకే ఆరాధ్య దైవం పెరియార్ పైనే పథకాలు పెట్టింది.
సీపీఎం కూడా గొడవ చేసింది. సీపీఎం ప్రభుత్వాలు ఉన్న సమయంలోనూ గాంధీ పేరు పెట్టలేదు. ముస్లిం లీగ్ ఏరోజు గాంధీజీని స్మరించలేదు. మతవాదంపైనే ఎన్నికలకు వెళతారు. శివసేన ఉద్దవ్ ఠాక్రే అసలు గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధం. బాల్ థాక్రే వారికి ఆరాధ్య దైవం.
ఇక కాంగ్రెస్ ఏ టైంకి ఆ గొడుగు పట్టేస్తుంది. కాంగ్రెస్ హయాంలో పెట్టిన పేర్లలో నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లే దేశమంతా పెట్టారు. ఎక్కడా గాంధీ పేరు పెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ హయాంలో పథకాలన్నింటికి ఈ ముగ్గురి పేర్లే ఉన్నాయి.
వీరందరికీ గాంధీపైన విపరీతమైన ప్రేమ ఉండి.. వాళ్లు ఏదో ఒలకబోస్తుంటే నిజమని అనుకుంటే పొరపాటు. వాళ్లు గాంధీని ఎంతగా విమర్శించారో చూశాం..
ప్రతిపక్షాలది గాంధీపై ప్రేమకాదు డబ్బులపై ప్రేమ.. ఉపాధి హామీ పథకంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.