AP New Pensions: ఏపీలో( Andhra Pradesh) కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్. కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు ఈ పింఛన్లు అందనున్నాయి. ఇన్చార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్లు సంయుక్తంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. అధికారంలోకి వస్తే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే కొన్ని బోగస్ పింఛన్లు ఉన్నాయి. వాటి తొలగింపునకు సంబంధించి సర్వే కూడా జరిగింది. ఇంతలో కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులు మేరకు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.
* భారీగా దరఖాస్తులు..
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల( long diseases) విషయంలో పింఛన్లు కోసం దరఖాస్తులు వచ్చాయి. కానీ కలెక్టర్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై కలెక్టర్ల సదస్సులో చర్చకు వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ఒక్కో జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు. వీటిని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు మంజూరు చేస్తారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి తో పాటు కలెక్టర్లకు వీటిని మంజూరు చేసే బాధ్యతలను అప్పగించారు.
* భర్త చనిపోతే భార్యకు..
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల మంజూరు అనేది ఇంతవరకు జరగలేదు. పింఛన్ లబ్ధిదారుడైన భర్త చనిపోతే భార్యకు పునరుద్ధరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా చేయలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది పింఛన్ల కోసం ఎదురు చూశారు. అటువంటి వారికి అవకాశం కల్పించారు చంద్రబాబు. మళ్లీ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో వెసులుబాటు ఇచ్చారు. అయితే 200 పింఛన్లు ఎంపిక అనేది ఇబ్బందికరంగా మారనుంది కలెక్టర్లకు. ఎందుకంటే అంతకుమించి అన్ని నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వస్తాయి. నియోజకవర్గాల వారీగా ఈ కొత్త పింఛన్ల కేటాయింపు అనేది చాలా కష్టం కూడా. మరి దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి.