Chiranjeevi Angry Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర ప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాములుగా అనిల్ రావిపూడి అయితే ఈపాటికి ప్రొమోషన్స్ ని మొదలు పెట్టేసేవాడు. కానీ ఇప్పటి వరకు ఆయన ప్రమోషనల్ వర్క్ మొదలు పెట్టలేదు. పైగా గత రెండు రోజుల నుండి ఆయన షూటింగ్ ప్యాచ్ వర్క్ చేస్తున్నాడు. నిన్న జరిగిన ప్యాచ్ వర్క్ కోసం ఆయన మెగాస్టార్ చిరంజీవిని కూడా షూటింగ్ రావాల్సిందిగా కోరాడట. అందుకు షూటింగ్ కి వచ్చిన చిరంజీవి కి జరిగింది తెలుసుకొని అనిల్ రావిపూడి పై మండిపడుతూ లొకేషన్ నుండి వాకౌట్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు టాలీవుడ్ లో ఇది ఆ నోట ఈనోట లీక్ అయ్యింది. ఇన్ని రోజులు షూటింగ్ లో ఎప్పుడూ రానటువంటి కోపాన్ని చిరంజీవి కి రప్పించాడట అనిల్. ఈ మేరకు ఒక గాసిప్ చక్కర్లు కొడుతోంది.
అసలు ఏమి జరిగిందంటే.. మెగాస్టార్ చిరంజీవి ని ప్యాచ్ వర్క్ షూటింగ్ కోసం పిలిచి, అనిల్ రావిపూడి తన స్నేహితురాలితో కలిసి చిరంజీవి గతంలో చేసిన సీన్లను మళ్లీ రీష్యూట్ చేయడానికి రెడీ అయ్యాడట.. అవి బాగా రాలేదని.. అనిల్ రావిపూడి స్నేహితురాలి ఔట్ ఫుట్ బాగా రాకపోవడంతో చిరంజీవిని రప్పించి మళ్లీ తీయడానికి ప్రయత్నించాడట… నీ స్నేహితురాలికి యాక్టింగ్ రాక అలాచేస్తే అసలు నన్ను ఎందుకు పిలిచావు, నా సమయం మొత్తం వృధా చేసావు కదా అని పెదవి విరిచి ప్యాకప్ చెప్పి లొకేషన్ నుండి చిరంజీవి వెళ్ళిపోయాడట. చిరంజీవి కోపాన్ని చూసి అనిల్ రావిపూడి దాదాపుగా ఏడ్చినంత పని చేసాడని టాక్. ఇన్ని రోజులు షూటింగ్ సరదాగా సాగిపోయింది, ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి, అంతా మంచిగా సాగుతోంది అనుకుంటున్న సమయం లో, ప్యాచ్ వర్క్ దగ్గర ఇలాంటి ఘటన జరిగిందేంటి అని అనిల్ రావిపూడి చాలా బాధపడ్డాడట. మరి అనిల్ పై అలకతో చిరంజీవి ప్రొమోషన్స్ కి డుమ్మా కొడతాడా?, లేదా జరిగిందంతా మర్చిపోయి ప్రొమోషన్స్ లో పాల్గొంటాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ‘మీసాల పిల్ల’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వంద మిలియన్ వైపు ఈ పాట పరుగులు తీస్తోంది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన శశిరేఖ పాట మాత్రం అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు. కానీ ఇంకా రెండు పాటలు విడుదల చేయాల్సి ఉందని, ‘మీసాల పిల్ల’ పాటకే ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు, మిగిలిన ఈ రెండు పాటలు వింటే ఏమైపోతారో అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. న్యూ ఇయర్ సందర్భంగా చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాటని కూడా విడుదల చేస్తారట.
చిరంజీవి లాంటి నంబర్ 1 యాక్టర్ తో కలిసి కాంబినేషన్ సీన్లకు అనిల్ తన యాక్టింగ్ రాని స్నేహితురాలిని పెట్టడం.. అవి సరిగ్గా రాకపోవడంతోనే ఈ ప్యాచ్ వర్క్ షూటింగ్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. దీనిపైనే సీరియస్ అయ్యి చిరంజీవి అలిగి వెళ్లిపోయాడట.. ఇది విన్న అభిమానులు అనుభవం ఉన్న ఆర్టిస్టులతో షూటింగ్ చేయకుండా, నీకు ఇష్టమొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మెగాస్టార్ సమయాన్ని వృధా చేస్తావా, ఇదేమిటయ్యా అనిల్ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియాల్సి ఉంది.