Economic Survey 2024 : ఆర్థిక సర్వే ఈరోజు పార్లమెంట్ లో విడుదల చేశారు. దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ సర్వేను ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సర్వే సిగ్నిఫికేంట్స్ ఏంటి? రేపు బడ్జెట్ ఉంది.. ఇవ్వాల ఈ ఆర్థిక సర్వే మొత్తం ఏం జరిగింది. గత సంవత్సరం మన ఆర్థిక ప్రణాళిక ఎలా ఉందని .. ఏ రంగం గురించి ఎలా ఉందని చెప్పేదే ఈ సర్వే.
2023-2024 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చూస్తే.. అన్ని దేశాల కంటే భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని సర్వే చూస్తే అర్థమవుతోంది. భారత్ అంగలేస్తూ ముందుకెళ్లింది.
పోయిన సంవత్సరం 8.2 శాతం వృద్ధిరేటు వచ్చింది. మేజర్ ఎకానమిస్ట్ లో ఏ దేశం కూడా ఈ శాతానికి చేరుకోలేదు. ప్రపంచంలో 8.2 శాతం సాధించిన దేశం ఏదీ లేదు. కానీ భారత్ మాత్రం సాధించింది. ఈ సంవత్సరం 6.2 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. ఈ సంవత్సరం వృద్ధి రేటు కూడా జాతీయ అవసరాలపైనే ఆధారపడాలని పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా చాలా సవాళ్లు ఉన్నాయి కాబట్టి దేశం నుంచే ఆర్థిక రంగం పెంచుకోవాలని సర్వేలో సూచించారు. మొన్నటి లాస్ట్ బడ్జెట్ లో 11 లక్షల కోట్లు మౌళిక వసతులకే మోడీ సర్కార్ కేటాయించడం విశేషం.
ప్రపంచ వృద్ధి రేటు తగ్గినా భారత్ వృద్ధి రేటు పరుగులు పెడుతున్న తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.